తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
సాక్షి లైఫ్ : నవమాసాలు మోసి శిశువుకు జన్మనిచ్చిన తల్లి నుంచి ఆ శిశువుకు అందే మొదటగా అమృతాహారం తల్లిపాలు. తల్లిపాలే శిశువు బంగారు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది. అందుకోసమే అందరికీ తల్లి పాల ప్రాధాన్యతను తెలియజేయడానికి ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు జరుపుతుంటారు. ఆగస్టు 1వతేదీ నుంచి ఆగస్టు 7వ తేదీవరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ పేరుతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఈ వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సంబంధితవ్యాధులు, చర్మవ్యాధులు, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తకుండా తల్లిపాలు సంరక్షిస్తాయి.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
పుట్టిన బిడ్డలకు పాలివ్వటం వల్ల తల్లుల్లో పెరిగిన క్రొవ్వుశాతం తగ్గుతుంది. అంతేకాదు వెంట వెంటనే గర్భధారణ జరుగదు. బిడ్డలకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ.
గర్భస్రావాలు ఎక్కువగా కావటం, పోషకాహారలోపం, మానసిక అలజడి, ఆందోళన, ఆతృత, హార్మోన్ల పెరుగుదల, తరుగుదలతోపాటు రొమ్ముల్లో ఇన్ఫెక్షన్లు, వయస్సు పెరిగిన తర్వాత గర్భం దాల్చడం వంటి కారణాలవల్ల కూడా కొందరిలో ప్రారంభం నుంచే పాల కొరత ఏర్పడుతుంది. కొందరిలో పాల ఉత్పత్తి అతికొద్దిగా మాత్రమే ఉండి శిశువుకు సరిపడవు. ఇంకొందరిలో ప్రారంభంలో పాలు బాగా ఉండి కొద్దిరోజుల తరువాత క్రమంగా తగ్గిపోతాయి. అందుకోసం ఇంటి చిట్కాలతో ఆయా సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు.
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
