మధుమేహం ఉన్నవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు.. 

షేర్ చేయండి:
మధుమేహం ఉన్నవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు.. 

సాక్షి లైఫ్ : డయాబెటిస్‌కు చికిత్స లేదు, అయితే, మీ జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ తెలుసుకోవలసిన రాత్రిపూట పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలున్నాయి. ఇవి ఫాలో అయితే మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.  

 
మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలను కుంటే రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే..?    

ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..  

 శారీరక శ్రమ.. 

రాత్రి భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకోవడం మీ అలవాట్లలో ఒకటి అయితే, ఇది మీ ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి  తిన్న తర్వాత కనీసం అరగంట లేదా ఒక గంట పాటు ఏదైనా శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం.


యోగా.. 

యోగా ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి.  రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత సమయం పాటు వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. 

 స్వీట్లకు దూరంగా ఉండండి..  

రాత్రిపూట స్వీట్లు తినడం మధుమేహ రోగులకు విషంతో సమానం. ఎందుకంటే..?  మీరు కూడా భోజనం తర్వాత ఏవైనా తీపిపదార్థాలు తింటే  అవి ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీని కారణంగా మీ మధుమేహం నియంత్రణలో ఉండదు. కాబట్టి రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. 

నిద్ర, నీరు.. 

రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు. ఇది కాకుండా, డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అందుకోసం రాత్రిపూట మొబైల్ స్క్రీన్‌లకు దూరంగా ఉండడం ఉత్తమం.

ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.