సాక్షి లైఫ్ : చాలామంది సెలెబ్రెటీలు పొద్దున్నే లేవగానే వేడి నీళ్లు తాగుతారు. సినిమా నటులదగ్గర నుంచి రాజకీయనాయకులదాకా చాలామంది వేడినీళ్లు తాగుతుంటారు. హాట్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. చాలామంది వేడి నీటిని తాగడం వారి దినచర్యలో భాగంగా చేసుకుంటారు ఎందుకంటే ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి. వేడి నీరు బరువు తగ్గించడంలో మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందించడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు హాట్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..
ఆహారం నుంచి వ్యాయామం వరకు..
బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నంలో ప్రజలు అనేక విషయాలను అనుసరిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం నుంచి వ్యాయామం వరకు ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అనేకరకాల పనులు చేస్తారు. అటువంటి వాటిలో వేడి నీళ్లు కూడా ఒకటి. హాట్ వాటర్ తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వేడి నీరు ఉపయోగపడుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం..
మీరు తరచుగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలం మృదువుగా మారి, విసర్జ సర్జనకు సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడానికి ..
గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగవ్వడమేకాకుండా, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
నిర్విషీకరణ..
వేడి నీరు చెమటను పెంచడం, మూత్రవిసర్జనను ప్రోత్సహించడం ద్వారా నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలోని విష పదార్థాలను తొలగిచడంలో కూడా వేడి నీరు ఉపయోగపడుతుంది.
మెరుగైన రక్త ప్రసరణ..
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాల పంపిణీని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా హాట్ వాటర్ చాలాబాగా పనిచేస్తుంది.
ఒత్తిడిని దూరం..
వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి తగ్గి రిలాక్స్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది.
నొప్పులు తగ్గించడంలో..
గోరువెచ్చని నీరు కండరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తద్వారా కండరాల నొప్పి, ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి.. పగిలిన పెదవుల సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com