సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వైరస్‌లు మనిషి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఈ వైరస్‌లు మనుషుల్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఇలాంటి వైరస్‌లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వైరస్ లు నిన్న, మొన్న, ఈ రోజు మాత్రమే పుట్టుకొచ్చినవి కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మానవులకు ,జంతువులకు సోకుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్నాయి.
నిపా వైరస్..
మన చుట్టూ అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి, ఇవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. అది కరోనా వైరస్, నిపా వైరస్ అయినా వాటి పరిణామాల గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ప్రస్తుతం వివిధ రకాల వైరస్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ వైరస్లు మిలియన్ల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్నాయని మీకు తెలుసా..? వాటి మూలాలు నేటికీ మిస్టరీగా మిగిలిపోయినప్పటికీ అవి చాలా సంవత్సరాలుగా మన మధ్యలోనే ఉంటున్నాయి. వీటిలో కొన్ని వైరస్‌లు కొంతకాలం క్రితం ఉనికిలోకి వచ్చాయి. ప్రపంచంలోని పురాతనమైనవి ,మిలియన్ల సంవత్సరాలుగా ఉన్న కొన్ని వైరస్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. దంతాల పొడవు తగ్గించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఎండోజెనస్ రెట్రోవైరస్ (ఈఆర్వీ)..
ఎండోజెనస్ రెట్రోవైరస్ అంటే..? ఈఆర్వీ అనేది ప్రపంచంలోనే అతి పురాతన వైరస్.ఈ ఎండోజెనస్ రెట్రోవైరస్లు (ఈఆర్వీ) అని పిలిచేవాళ్ళు. ఇవి ఒకప్పుటి ఇన్ఫెక్షియస్ ఎక్సోజనస్ రెట్రోవైరస్ల అవశేషాలను సూచిస్తాయి. ఐతే ఇవి మన డీఎన్ ఏలో స్థిరపడిపోయాయి. వీటిలో చాలా వరకు సాధారణంగా నిద్రాణస్థితిలో ఉన్నప్పటికీ, అవి వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో సహా అనేక ఉద్దీపనల ద్వారా తిరిగి మళ్లీ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
హెపటైటిస్ బి వైరస్ (హెచ్ బీవీ)..
హెచ్ బీవీ అనేది పురాతన వైరస్లలో ఒకటి, చాలా సంవత్సరాల క్రితం కనుగొనబడిన ఇన్ఫెక్షన్ కేసులు. DNA అధ్యయనాలు కొన్ని మమ్మీల్లో HBV సీక్వెన్స్‌లను గుర్తించాయి. పురాతన కాలంలో దాని ప్రాబల్యం గురించి కూడా గురించారు.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పీవీ)..
ఇది మరొక పురాతన వైరస్, ఇది చాలా సంవత్సరాలుగా మానవులకు సోకుతూనే ఉంది. DNA అధ్యయనాలు పురాతన మానవ జనాభాలో HPV క్రమాలను గుర్తించడాన్ని బట్టి ఇవి పురాతన వైరస్ అని సూచిస్తుంది.
హెర్పెస్ వైరస్..
హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ ఎస్ వీ) ఎప్స్టీన్-బార్ వైరస్ (ఈబీవీ)తో సహా వివిధ హెర్పెస్ వైరస్ల ఉనికికి సంబంధించిన ఆధారాలు పురాతన కాలం నాటివని పరిశోధకులు గుర్తించారు. ఇది మిలియన్ల సంవత్సరాలలో దాని పరిణామంతో సహ-పరిణామం చెందింది.
ఇన్ఫ్లుఎంజా వైరస్..
ఇన్ఫ్లుఎంజా అనేది ఓ రకమైన అంటు వ్యాధి. "ఇన్‌ఫ్లుఎంజా" అనే పేరు 15వ శతాబ్దపు ఇటలీలో ఉద్భవించింది. "నక్షత్రాల ప్రభావం" గా దీనిని భావిస్తారు. ఇన్ఫ్లుఎంజా వైరస్ మొట్టమొదటి అంటువ్యాధి 1580లోనే వచ్చింది.
పాలియోమా వైరస్..
పాలియోమా వైరస్‌లు మానవులతో సహా వివిధ సకశేరుకాల జాతులలో కనిపించే పురాతన వైరస్‌ల కుటుంబం. డీ ఎన్ ఏ అధ్యయనాలు పురాతన మానవ జనాభాలో ఈ వైరస్‌ను గుర్తించాయి.
పాక్స్ వైరస్..
పాక్స్ వైరస్, వేరియోలా వైరస్ (మశూచి ఏజెంట్)తో పాటు ప్రపంచంలోని పురాతన వైరస్లలో ఒకటి. ఈ వైరస్లు బహుశా వేల సంవత్సరాల నుంచి మానవులకు సోకుతున్నాయి. డీఎన్ ఏ అధ్యయనాలు మశూచి చరిత్రకు ఆధారాలు కనుగొన్నాయి.
ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com