హోమియోపతిలో ఏ వ్యాధులు నయం అవుతాయి..?
సాక్షి లైఫ్: హోమియోపతి మందులు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కొన్నిరకాల వ్యాధులను నయం చేయగలవని హోమియో వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏ వ్యాధులను నయం చేయడంలో హోమియోపతి చికిత్స ప్రభావవంతంగా ఉంటుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2024 సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..
ఇది కూడా చదవండి.. సూర్యగ్రహణం డైరెక్ట్ గా చూస్తే కళ్లు దెబ్బతింటాయా..?
అద్భుతమైన చికిత్స..
హోమియోపతి అనేది ఎటువంటి నొప్పి లేకుండా సమస్యలను నయం చేసే చికిత్సా విధానం. అలాగే, హోమియోపతి గురించి తరచుగా చెప్పే ఒక విషయం ఏమిటంటే, వ్యాధిని దాని మూలాల నుంచి తొలగించాలనుకుంటే హోమియోపతిని అనుసరించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా వ్యాధులు నయం అవ్వడానికి వారు చాలా మందులు తీసుకోవాలి. ఒకవేళ వాడినప్పటికీ నివారణకు ఎటువంటి హామీ ఉండదు. సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ,యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులలో హోమియోపతి చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధి తీవ్రత, దాని వల్ల కలిగే ఒత్తిడి, దానికి వ్యక్తి స్పందన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని హోమియోపతి మందులు ఇస్తారు. ఈ ఔషధాల సహాయంతో అనేక వ్యాధులను వాటి మూలాల నుంచి నయం చేయవచ్చు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
సంపూర్ణ గ్రహణం సమయంలో కూడా, సూర్యుడు చంద్రుని పాక్షికంగా లేదా పూర్తిగా దాచినప్పుడు, సూర్యుని కిరణాలు చాలాతీవ్రంగా ఉంటాయని, అవి కళ్ళకు హాని కలిగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడిని నేరుగా చూడటం వల్ల సోలార్ రెటినోపతి అనే పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు రెటీనాను దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
