ఈ కూరగాయలను పచ్చిగా తింటున్నారా..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి అనేది అందరికీ తెలిసిందే. అయితే పాచి కూరగాయలు, పండ్లు తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వైదులు చెబుతున్నారు. కొన్నిరకాల కూరగాయలు ఉడికించి తింటారు, మరికొన్ని పచ్చిగా తింటారు. అలంటి వాటిలో పచ్చిగా తినకూడని కూరగాయలున్నాయి. అవి తింటే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు

 కూరగాయలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పోతాయని మనం తరచుగా వింటుంటాం. ఇది మాత్రమే కాదు, కూరగాయలు, పండ్లను ఎలాంటి ప్రాసెసింగ్ లేదా వంట లేకుండా తినడం వల్ల అదనపు శక్తి లభిస్తుందని అంటారు. 

అంతేకాదు అవి తింటే చర్మ సంరక్షణ , మంచి జీర్ణశక్తి, గుండె ఆరోగ్యంగా ఉండడమేకాకుండా, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని కొందరు నమ్ముతారు. అయితే పొరపాటున కూడా పచ్చిగా తినకూడని కొన్ని కూరగాయలు ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. 

పచ్చి కూరగాయలు తినడం వల్ల శరీరం పరాన్నజీవులు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలకు గురవుతుంది, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.అలాంటి కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి కూరగాయలు పచ్చిగా తినకూడదు..?

 -వంకాయ

వంకాయలో బద్దెపురుగులు ఎక్కువగా ఉంటాయి. కొన్నిటిలో మనకు సహజంగానే పుచ్చు కనిపిస్తుంది. బద్దెపురుగులు  రక్తప్రవాహంలోకి ప్రవేశించగలవు. కాబట్టి దీనిని నివారించడానికి వంకాయలను పూర్తిగా ఉడికించడం ఉత్తమ మార్గం.

-చామకూర ఆకులు

చామకూర ఆకులను ఆహారం కోసం ఉపయోగించే ముందు తప్పకుండా ఉడకబెట్టాలి. అదే నియమం బచ్చలికూర, పాల కూరకి వర్తిస్తుంది. అధిక ఆక్సలేట్ స్థాయిలు కలిగి ఉన్నందున వాటిని వేడి నీటిలో ఉడికించాలని అలా ఉడికిస్తే ఆక్సలేట్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

 -క్యాబేజీ

క్యాబేజీలో కొన్ని రకాల పురుగులు నివసిస్తూ అందులో గుడ్లను పెడతాయట. ఇవి కంటికి  కనిపించవు, కానీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఆ పురుగులను చంపడానికి కొన్ని పురుగుమందులను పిచికారీ చేసినప్పుడు కూడా కొన్ని క్యాబేజీ లోపల బతికే ఉంటాయి. కాబట్టి మీ క్యాబేజీని తినడానికి ముందు శుభ్రం చేసి, ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఉడికించాలి. 

-క్యాప్సికమ్

 క్యాప్సికమ్లను ఉపయోగించే ముందు, వాటి గింజలను తీసివేసి, వాటిని వేడి నీటిలో కడగాలి, ఎందుకంటే లోపల బద్దెపురుగులు గుడ్లు పెడతాయి. బతికే ఉంటాయి. కాబట్టి  క్యాప్సికమ్ ను ఉడికించకుండా తినలేము. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com