Cancer-Causing Viruses : క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన వైరస్లు మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : వైరల్ ఇన్ఫెక్షన్ అంటే సాధారణంగా జలుబు, దగ్గు లేదా స్వల్పకాలిక జ్వరం మాత్రమే గుర్తొస్తుంది. అయితే కొన్ని రకాల వైరస్లు శరీరంలో దీర్ఘకాలం తిష్టవేస్తే, అవి క్రమంగా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ రానప్పటికీ, శరీరంలో నిరంతర ఇన్ఫ్లమేషన్ (inflammation) ఏర్పడటం లేదా కణాల డీఎన్ఏ దెబ్బతినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ప్రధానంగా ముప్పు కలిగించే వైరస్లు, వాటి నివారణ మార్గాలపై అవగాహన అందరికీ ఉండాలి..
క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్లు ఇవే..
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)..మహిళల్లో గర్భాశయ ముఖద్వార (cervical cancer) క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ. ముఖ్యంగా దీనిలోని 16, 18 రకాల స్ట్రెయిన్లు అధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు గొంతు, పురీషనాళం, ఇతర జననేంద్రియ క్యాన్సర్లకూ ఇది దారితీయవచ్చు. సరైన వయసులో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ ముప్పును గణనీయంగా నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
హెపటైటిస్ బి, సి (HBV & HCV)..ఈ వైరస్లు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు ఇవి దారితీస్తాయి. కలుషితమైన రక్తం ఎక్కించడం, వాడిన సూదులు మళ్లీ వాడటం, అసురక్షిత సంబంధాల ద్వారా ఇవి వ్యాపిస్తాయి. హెపటైటిస్-బి నివారణకు సమర్థవంతమైన టీకా అందుబాటులో ఉంది. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వీటిని ముందుగానే గుర్తించవచ్చు.
ఎప్స్టీన్-బార్ వైరస్ (EBV)..ఇది అత్యంత సాధారణ వైరస్ అయినప్పటికీ, చాలా మందిలో ఎలాంటి తీవ్ర సమస్యలు రావు. అయితే కొందరిలో రోగనిరోధక శక్తి లోపించినప్పుడు నాసోఫారింజియల్ అంటే ముక్కు, గొంతు వెనుక భాగం క్యాన్సర్, లింఫోమా అంటే బ్లడ్ క్యాన్సర్ రకం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
హెచ్‌టీఎల్‌వీ-1 అండ్ హెచ్‌హెచ్‌వీ-8 ..అరుదైన వైరస్లు..
హ్యూమన్ టి-లింఫోట్రోపిక్ వైరస్-1 (HTLV-1) రక్త కణాలపై ప్రభావం చూపి ల్యుకేమియాకు దారితీసే అవకాశం ఉండగా; హ్యూమన్ హెర్పెస్ వైరస్-8 (HHV-8) కపోసి సార్కోమా అనే అరుదైన క్యాన్సర్‌కు కారణమవుతుంది.
నివారణ మార్గాలు..
వైరస్ల వల్ల తలెత్తే క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవ డానికి సరైన సమయంలో టీకాలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో పాటు, కాలేయ రక్షణ కోసం హెపటైటిస్-బి టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి. దీనితో పాటే మహిళలు క్రమం తప్పకుండా ప్యాప్ స్మియర్ పరీక్షలు, కాలేయ పనితీరును అంచనా వేసే లివర్ ఫంక్షన్ పరీక్షల వంటి స్క్రీనింగ్‌లను వైద్యుల పర్యవేక్షణలో చేయించుకోవడం ద్వారా సమస్యను తొలి దశలోనే గుర్తించవచ్చు.
ఏదైనా చికిత్స సమయంలో..
మరోవైపు, ఏదైనా చికిత్స సమయంలో లేదా రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు సురక్షితమైన, పరీక్షించిన రక్తాన్నే వినియోగించాలి. ఇంజెక్షన్ల కోసం ఎల్లప్పుడూ ఒకసారి మాత్రమే వాడే సరికొత్త డిస్పోజబుల్ సూదులనే వాడేలా జాగ్రత్త పడటం ద్వారా సంక్రమణ ముప్పును పూర్తిగా నివారించవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండటం, తగిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును చాలా వరకు ముందుగానే అడ్డుకోవచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
