Fruits vs Fruit Juice : పండ్లు తినడం మంచిదా.. జ్యూస్ తాగడం మేలా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పండ్ల ద్వారా సమృద్ధిగా లభిస్తాయి. అయితే పండ్లను నేరుగా ముక్కలుగా కోసుకుని తినడం మంచిదా..? లేక జ్యూస్( juice) రూపంలో తీసుకోవడం ఉత్తమమా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. జ్యూస్ కంటే పండ్లను నేరుగా తినడమే ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఎందుకో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
పండ్లను నేరుగా ఎందుకు తినాలి అంటే..?
పీచు పదార్థం (fiber) లభిస్తుంది..పండ్లను ముక్కలుగా నమిలి తిన్నప్పుడు శరీరానికి అవసరమైన సహజసిద్ధమైన పీచు అందుతుంది. జ్యూస్ తీసే ప్రక్రియలో ఈ పీచు అధిక శాతం తొలగిపోతుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి, మలబద్ధకం నివారించడానికి ఫైబర్ చాలా అవసరం.
రక్తంలో చక్కెర అదుపు..
పండ్లలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ, వాటిలోని పీచు పదార్థం వల్ల చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అదే జ్యూస్ తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు (blood sugar levels) వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఆకలిని నియంత్రిస్తుంది..
పండ్లను నమిలి తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సమయం ఉంటుంది. దీనివల్ల బరువు నియంత్రణ సులభమవు తుంది. అదే జ్యూస్ అయితే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరిపోతాయి.
ప్యాక్డ్ జ్యూస్‌లతో పొంచి ఉన్న ముప్పు..
మార్కెట్లో '100శాతం ప్యూర్', 'రియల్ ఫ్రూట్ జ్యూస్' పేర్లతో లభించే ప్యాకేజ్డ్ డ్రింక్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అదనపు చక్కెరలు, ప్రిజర్వేటివ్స్..ప్యాక్ చేసిన రసాలలో రుచి, నిల్వ కాలం పెంచడానికి కృత్రిమ స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి శరీరంలో అనవసరపు కేలరీలను పెంచి ఊబకాయం, మధుమేహం సమస్యలకు దారితీస్తాయి. దంతక్షయం ప్రమాదం.. ప్యాక్డ్ లేదా తీపి ఎక్కువగా ఉండే జ్యూస్‌లను సిప్ చేస్తూ ఎక్కువ సమయం తాగడం వల్ల దంతాలపై చక్కెర పొర ఏర్పడి పిప్పిపళ్లు, దంతక్షయం సమస్యలు తలెత్తుతాయి.
చిన్నారులకు దూరం పెట్టాలి..ఒకటి నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి ప్యాకేజ్డ్ పండ్ల రసాలు ఇవ్వకూడదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ స్పష్టం చేస్తోంది. వాటికి బదులు మెత్తగా చేసిన తాజా పండ్ల ముక్కలనే అందించాలి. ప్యాక్డ్ రసాలు లేదా వడకట్టిన జ్యూస్లపై ఆధారపడకుండా.. రోజూ ఆపిల్, నారింజ, జామ, బొప్పాయి వంటి తాజా పండ్లను నేరుగా తినడమే శారీరక ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఇస్తుంది.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
