@ 7 ఏళ్లు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'..  

షేర్ చేయండి:
@ 7 ఏళ్లు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'..  

సాక్షి లైఫ్ : దేశంలోని పేద, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన, చౌకైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకం ప్రారంభించి ఏడేళ్లు పూర్తయింది. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సంక్షేమం అందించాలనే "సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్" లక్ష్యానికి అనుగుణంగా, ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన పురోగతిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

అర్హులైన ప్రతి కుటుంబానికి..  

అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది.12 కోట్లకు పైగా బలహీన వర్గాల కుటుంబాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. అక్టోబర్ 28, 2025 నాటికి 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. 

సీనియర్ సిటిజన్లకు..  

 70 ఏళ్లు పైబడిన 86 లక్షలకు పైగా సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు.ఆదా: తాజా ఆర్థిక సర్వే (2024-25) ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులకు రూ. 1.52 లక్షల కోట్లకు పైగా జేబు ఖర్చు (Out-of-Pocket Expenses) ఆదా అయింది. దేశవ్యాప్తంగా 17వేలకుపైగా ప్రభుత్వ ఆసుపత్రులు,15వేలకు పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం 33వేలకు పైగా ఆసుపత్రులు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. 

 ఆయుష్మాన్ భారత్ నాలుగు స్తంభాలు AB-PMJAY అనేది 'ఆయుష్మాన్ భారత్' అనే విస్తృత పథకంలో ఒక భాగం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సార్వత్రికంగా అందించడానికి ఈ పథకం నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది. 

పథకం పేరులక్ష్యంపురోగతి (ప్రస్తుత గణాంకాలు)PM-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)సెకండరీ, టెరిటియరీ కేర్ కోసం ఏటా రూ. 5 లక్షల బీమా.42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ (AAM)ప్రజల ఇంటికి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (Primary Healthcare) సేవలు అందించడం.

సెప్టెంబర్ 2025 నాటికి 39.61 కోట్లకు పైగా టెలికన్సల్టేషన్లు అందించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)దేశ ఆరోగ్య వ్యవస్థను డిజిటల్‌గా అనుసంధానించడం, ప్రతి పౌరుడికి ABHA (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ID ఇవ్వడం. 79.91 కోట్లకు పైగా ABHA ఖాతాలు ఉన్నాయి.

 ఆగస్టు 5, 2025 నాటికి.. PM-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM)గ్రామాలు, జిల్లా స్థాయి వరకు ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం. 2021-2026 మధ్య రూ. 64,180 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య మౌలిక సదుపాయాల పథకం. బడ్జెట్ అంచనాల్లో పెరుగుదలకేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులను ఏటా పెంచుతూ వస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ. 9,406 కోట్లుగా ఉంది. ఈ పథకాలన్నీ కలిసి పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చేస్తూ, 'వికసిత్ భారత్ @ 2047' లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడుతున్నాయని కేంద్రం పేర్కొంది.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.