దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్ని..?

షేర్ చేయండి:
  దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్ని..?

సాక్షి లైఫ్ : గత 24 గంటల్లో దేశంలో 573 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,565కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. 

కరోనా కారణంగా ఇద్దరు మృతి..  

 గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కర్నాటకలో ఒకరు, హర్యానాలో ఒకరు కోవిడ్ -19 కారణంగా చనిపోయారు. దేశవ్యాప్తంగా నిన్న 636 కొత్త కేసులు నమోదవ్వగా, ముగ్గురు మరణించారు. 

కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు..  

వాస్తవానికి దేశంలో చలి పెరుగడంతో, కొత్త వేరియంట్స్ తర్వాత, కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు   దేశవ్యాప్తంగా 190 దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారని, 5.3 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉండగా, రికవరీ రేటు 98.81శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌లను అందించారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.