భారతదేశంలో 12 శాతం మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్‌ తీసుకోలేదు.. 

షేర్ చేయండి:
భారతదేశంలో 12 శాతం మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్‌ తీసుకోలేదు.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలో మీజిల్స్ వ్యాక్సినేషన్‌కు అర్హులైన 12 శాతం మంది పిల్లలు సిఫార్సు చేసిన రెండు డోస్‌లు తీసుకోలేదని గణాంకాలు వెల్లడి స్తున్నాయి. ఈ లెక్కలు టీకా అంతరాన్ని సూచిస్తున్నాయి. జీరో డోస్ కేసులు ఈశాన్య రాష్ట్రాలలో అత్యధికంగా ఉన్నాయని, అందులో నాగాలాండ్ వాటా 26 శాతం ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. తమిళనాడులో అత్యల్పంగా 4.6 శాతం నమోదైంది.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

భారతదేశంలో మీజిల్స్ వ్యాక్సినేషన్‌కు అర్హులైన 12 శాతం మంది పిల్లలు సిఫార్సు చేసిన రెండు డోస్‌లలో ఏదీ తీసుకోలేదు. ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులు మీజిల్స్ టీకా ఎందుకు తీసుకోలేదో అనే అంశాలను పరిశోధించారు. ఇందులో అస్సలు తీసుకొనేవారు, ఒక్కడోస్ తీసుకున్నవ్యక్తులపై అధ్యయనాలు నిర్వహించారు.

43,000 కంటే ఎక్కువ మంది పిల్లల నుంచి డేటాను విశ్లేషించారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ద్వారా సేకరించిన 2-3 సంవత్సరాల వయస్సు గల 43,000 కంటే ఎక్కువ మంది పిల్లల డేటాను వారు విశ్లేషించారు. దాదాపు 30 శాతం మంది పిల్లలు మాత్రమే మీజిల్స్ వ్యాక్సిన్‌ను పొందారని బృందం కనుగొంది.

 60 శాతం మంది.. 

 దాదాపు 60 శాతం మంది రెండు డోస్ ల టీకాలు వేసుకున్నారు. ఈ అధ్యయనం వ్యాక్సిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ విశ్లేషణ జిల్లాల వారీగా వ్యాక్సినేషన్‌లో వైవిధ్యాలను కూడా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో, ప్రయాగ్‌రాజ్ , బండాలో వరుసగా 34 శాతం ,32 శాతం అస్సలు ఎలాంటి డోస్ తీసుకోలేదని గుర్తించారు. హాపూర్, ఇటావాలో 2.6 , 2.1 శాతం కేసులు కనుగొన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్ లో 50 శాతం మంది పిల్లలు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో దాదాపు 50 శాతం మంది పిల్లలు టీకా రెండు డోస్ లు పొందలేదు, దిగువ దిబాంగ్ వ్యాలీలో అటువంటి కేసుల శాతం కేవలం 2.8 మాత్రమేనని అధ్యయన బృందం గుర్తించింది. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.