షవర్మాలో బ్యాక్టీరియా.. తయారీదారులపై చట్టపరమైన చర్యలు..
సాక్షి లైఫ్ : హోటళ్లలో తినే ఆహారం అంతా సురక్షితం కాదని, ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని కర్ణాటకలోని ఆహార భద్రత, నాణ్యత విభాగం హెచ్చరించింది. ఇప్పటికే పీచు మిఠాయి, గోబీ మంచురియా లలో ఉపయోగించే రంగులపై నిషేధం విధించిన తర్వాత ఆహార భద్రత ,నాణ్యత విభాగం అనేక రెస్టారెంట్లలో తనిఖీలు చేసింది. ఇప్పుడు షవర్మా కూడా తినదగ్గది కాదని తమ నివేదిక లో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.. పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులపై నిషేధం..
చట్టపరమైన చర్యలు..
ఇటీవల కొందరు షవర్మా తిని అస్వస్థతకు గురైన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు చోట్ల విక్రయించే షవర్మా నమూనాలను సేకరించి పరీక్షించారు. కొన్ని నమూనాలలో ఆరోగ్యానికి హానికలిగించే కారకాలున్నట్లు కనుగొన్నారు. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించిన ఆహార భద్రత, నాణ్యత విభాగం కమిషనర్.. ఆహార తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సురక్షితం కాదు..
బెంగళూరు రూరల్, మైసూర్, తుమకూరు, హుబ్బల్లి-ధార్వాడ్, మంగళూరు, బళ్లారి , బెల్గాం జిల్లాలలో విక్రయిస్తున్న 17 నమూనాలలో, 9 షవర్మాలు వినియోగించవచ్చు. మిగిలిన 8 వాటిలో బ్యాక్టీరియా ఉందని, అవి వినియోగానికి సురక్షితం కాదని తేల్చింది.
అపరిశుభ్రత కారణంగా..
ఆహార తయారీ సమయంలో పరిశుభ్రత లోపించడం, ఎక్కువ కాలం నిల్వ ఉంచడం, అందించే సమయంలో అపరిశుభ్రత కారణంగా ఆహారంలో హానికరమైన కారకాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో, ఆహార తయారీ ,పంపిణీ సమయంలో పూర్తి పరిశుభ్రత, ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రతిరోజూ తాజాగా ఉండే షవర్మాలను మాత్రమే విక్రయించాలని షవర్మా తయారీదారులకు సూచించారు. షవర్మ తయారీదారులు పరిశ్రమ FSSAI నమోదు పొందాలి. పబ్లిక్ నోటీసు ప్రదర్శించాలి. ఆరోగ్య కారణాల దృష్ట్యా FSSAI వద్ద నమోదు చేసుకున్న విక్రేతల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
