పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులపై నిషేధం..
సాక్షి లైఫ్: ఆహార భద్రతలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులను కలుప కూడదని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కూడా ఇందుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లు, వీధి దుకాణాలు సహా 260 తినుబండారాల నమూనాలను పరీక్షించారు. 41 శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు, కృత్రిమ రంగు ఉన్నట్లు కనుగొన్నారు అధికారులు.
ఇది కూడా చదవండి.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి..న్యూ స్టడీ: స్లీప్ అప్నియా ఔషధం మరో రెండు సమస్యలకూ ఉపయోగకరం
వీటిలో 18తినుబండారాలను తినదగనివిగా గుర్తించారు. పానీపూరీలో రంగుల కోసం టార్ట్రాజైన్ అనే సింథటిక్ కలర్ ఎక్కువగా కలుపుతున్నట్లు గుర్తించారు. వంటకాలు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఉపయోగించే ఈ పదార్థాలు క్యాన్సర్‌తో పాటు ఉదర వ్యాధులు, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరుసటి రోజు, కబాబ్‌లకు కృత్రిమ రంగులు జోడించడాన్ని ఆరోగ్య శాఖ నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు అక్కడి అధికారులు. గతంలో పీచు మిఠాయి, గోబీ మంజురియన్‌లో కూడా కృత్రిమ రంగులను నిషేధించారు. లిక్విడ్ నైట్రోజన్ (డ్రై ఐస్) ఉన్న ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
