నిఫా వ్యాప్తిని నిరోధించేందుకు రంగంలోకి కేంద్రం ప్రత్యేక బృందాలు..
సాక్షి లైఫ్: కేరళలో మళ్లీ నిఫా వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అందులోభాగంగా కేంద్ర ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపేపనిలో పడింది. యాక్టివ్ కేసులను గుర్తించడం, కాంటాక్ట్ లిస్ట్‌తో సహా నాలుగు అత్యవసర ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే నిఫా నివారణ చర్యల్లో భాగంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాకి సహకరించేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే తమ పనిని ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
14 ఏళ్ల బాలుడు..
మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు చనిపోగా, అతని కుటుంబ సభ్యులకు నిఫా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అంతేకాదు ఆయా ప్రాంతంలో నిఫా కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. నిఫా వ్యాధి ఉన్న వారిని క్వారంటైన్ లో ఉంచాలని, అనుమానిత నిఫా లక్షణాలు ఉన్నవారిని కూడా వేరే ప్రాంతానికి తరలించాలని సూచించారు. పేషెంట్‌తో కాంటాక్ట్‌లో ఉన్నవారు, అనుమానం ఉన్న వారి గురించిన సమాచారాన్ని వెంటనే సేకరించి ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా గుర్తించేందుకు అవసరమైన పరీక్షలకు సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
కేంద్ర బృందం..
కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వన్ హెల్త్ మిషన్ సభ్యులతో కూడిన కేంద్ర బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సేవలందించనుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అవసరమైన మందులను పంపిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐతే వ్యాధిని నిర్ధారించేందుకు పరీక్షలను వేగవంతం చేసేందుకు కోజికోడ్‌కు మొబైల్ బయోసేఫ్టీ లెవల్-3 (బీఎస్‌ఎల్-3) ప్రయోగశాల అందుబాటులో ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
