కరోనా వైరస్ లేటెస్ట్ అప్ డేట్స్..  

షేర్ చేయండి:
కరోనా వైరస్ లేటెస్ట్ అప్ డేట్స్..  

సాక్షి లైఫ్ : మంగళవారం గడిచిన 24 గంటల్లో దేశంలో 236 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతోపాటు దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,031కి చేరుకుంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలో ఒకరు, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు రోగులు మరణించారు.
 
కోవిడ్ కేసులు..  

డిసెంబర్ 5, 2023 నాటికి, రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గిందని, అయితే కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ గుర్తించిన తర్వాత ఈ కేసులలో పెరుగుదల నమోదైందని కేంద్రఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కోవిడ్ సోకిన రోగులలో 92 శాతం మంది ఇంట్లోనే ఉండడం ద్వారా కోలుకుంటున్నారు. వారు ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇంటివద్దనే అవసరమైన చికిత్స తీసుకుని ఆయా వైరస్ నుంచి బయటపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాధి సోకింది..?

భారతదేశంలో కోవిడ్ -19 ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకు 4కోట్ల 50లక్షల మందికి వ్యాధి సోకింది. సంక్రమణ కారణంగా దేశవ్యాప్తంగా 5.3 లక్షల మందికి పైగా మరణించారు. అలాగే, ఇప్పటివరకు 4కోట్ల 40లక్షల  మందికి పైగా కోవిడ్ సోకిన వ్యక్తులు కోలుకున్నారు.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.