హిమాచల్ లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు..  

షేర్ చేయండి:
హిమాచల్ లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు..  

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా డెంగ్యూ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా  హిమాచల్‌లోని రాంపూర్‌లో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. నిర్మంద్ తహసీల్‌లోని జగత్‌ఖానా, చాటి ప్రాంతాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం, తలనొప్పి, శరీరంలో నొప్పి, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, నాలుక రుచి కోల్పోవడం వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి.
 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ప్లేట్ లెట్స్ తగ్గడంతో.. 

 కొందరిలో ప్లేట్ లెట్స్ తగ్గడంతో మేక పాలు, కివి పండు, కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. రాంపూర్‌లో, డెంగ్యూ ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల ప్రజలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం రాంపూర్ నగరంలో నివసించేవారిలో డెంగ్యూ కారణంగా ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.


డెంగ్యూ విజృంభణ పెరుగుతుండడంతో ఇతర ప్రాంతాలనుంచి రాంపూర్‌కు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రజలు తమ పనులు చేసుకునేందుకు పూర్తి భద్రతతో నగరానికి వచ్చి వెళ్తున్నారు. దీని ప్రభావం నగరంలోని వ్యాపారంపైనా కనిపిస్తోంది. రాంపూర్‌లోని ఇళ్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతూ వైద్యులు ఇచ్చిన సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. నగరంలో పలువురు వ్యాపారులు డెంగ్యూతో బాధపడుతుండటంతో కొంత మంది ఇళ్లలోనే ఉంటున్నారు. 

వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు కూడా పెరుగుతున్నాయని, ఒకటి, రెండు రోజుల్లో డెంగ్యూ లక్షణాలు కనిపించవని, ఐదారు రోజుల తర్వాత జ్వరం లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.