కేరళలో మంకీపాక్స్ వైరస్ క్లాడ్-1 వేరియంట్ మొదటి కేసు నమోదు..
సాక్షి లైఫ్ : ఆఫ్రికా ఖండంలో విధ్వంసం సృష్టించిన మంకీపాక్స్ వైరస్ (ఎం పాక్స్ వైరస్) ప్రమాదకరమైన వేరియంట్ క్లాడ్-1 ఇప్పుడు భారతదేశానికి చేరుకుంది. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రాణాంతక వైరస్ కేసు కేరళలో వెలుగు చూసింది. ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గత నెలలోనే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
క్లాడ్-1 స్ట్రెయిన్..
కేరళ ఆరోగ్య శాఖ ప్రకారం, 38 ఏళ్ల వ్యక్తికి క్లాడ్-1 స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేరళరాష్ట్ర ప్రభుత్వం, వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి.
కేరళలోని మలప్పురంలో తొలిసారిగా మంకీ పాక్స్ కు సంబంధించిన క్లాడ్-1 స్ట్రెయిన్ కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇది ప్రస్తుతం ఆఫ్రికన్ దేశాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్న జాతి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఈ కేసులు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను నివారించడానికి, దానికి సంబంధించిన లక్షణాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..మెరుగైన శ్వాసక్రియ కోసం ఏమేం చేయాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
