ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విజృంభిస్తున్న H3N2 వైరస్..  

షేర్ చేయండి:
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విజృంభిస్తున్న H3N2 వైరస్..  

సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 69 శాతం కుటుంబాలలో కనీసం ఒక సభ్యునికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

ఎందుకు ఈ పెరుగుదల అంటే..?

ఈ వైరల్ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం H3N2 (ఇన్ఫ్లూయెంజా ఏ)  వైరస్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ ఫ్లూ కంటే కొంచెం భిన్నంగా, తీవ్రమైన లక్షణాలను కలిగిస్తోంది. ముఖ్యంగా, అధిక జ్వరం, తీవ్రమైన దగ్గు, అలసట వంటి లక్షణాలు ఎక్కువ కాలం ఉంటున్నయని వైద్యులు చెబుతున్నారు. సాధారణ జలుబు 3-5 రోజుల్లో తగ్గిపోతే, H3N2 వల్ల వచ్చే ఫ్లూ లక్షణాలు 10 రోజుల దాకా ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఎవరికి ప్రమాదం..?

పిల్లలు, వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు (ఉదాహరణకు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు) ఉన్నవారికి ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చాలా మందిలో న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలకు దారితీస్తోంది. దీని కారణంగా ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య కూడా పెరిగింది.

ఎలాంటి జాగ్రత్తలు అవసరం..  

తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.

జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి.

దగ్గు లేదా తుమ్మేటప్పుడు ముఖాన్ని మోచేతితో లేదా కర్చీఫ్ ను అడ్డం పెట్టుకోవాలి.

సరైన పోషకాహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి, వారి సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలి.

మీరు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా జ్వరం 3-4 రోజులకు మించి ఉన్నా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్‌లో అప్రమత్తంగా ఉండటం, ఆరోగ్య నిబంధనలు పాటించడం ద్వారా ఈ వ్యాధి నుంచి సురక్షితంగా ఉండవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. అపెండిక్స్ క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.