టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

సాక్షి లైఫ్ : టెఫ్లాన్ ఫ్లూ, పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు.ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..? సేమ్ టూ సేమ్ వైరల్ ఫీవర్ మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. టెఫ్లాన్ ఫ్లూ వచ్చినప్పుడు తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు అంటున్నారు. గత సంవత్సరం 267 మందికి పైగా అమెరికన్లు ఈ "టెఫ్లాన్ ఫ్లూ" కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అమెరికన్లు నాన్‌స్టిక్ ప్యాన్‌లలో సరైన పద్దతిలో వంట చేయకపోవడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ బారీన పడుతున్నారు. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 ఇది కూడా చదవండి..కాగ్నిటివ్ డిక్లైన్ సమస్యను ఎలా నిరోధించవచ్చు..?

 ఇది కూడా చదవండి..హెల్త్‌కేర్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు..

టెఫ్లాన్ అనేది..

 నాన్‌స్టిక్ కోటింగ్ టెఫ్లాన్ ను అనేక రకాల వంటసామాను వస్తువులపై ఉపయోగిస్తున్నారు. టెఫ్లాన్ అనేది ఓ రకమైన రసాయనిక సమ్మేళన పూత. జ్వరం, కండరాల నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి ఫ్లూ వంటి లక్షణాలతో ఈ టెఫ్లాన్ ఫ్లూ మొదలవుతుంది. నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం, లేదా సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్లనే టెఫ్లాన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

పొగ కారణంగా..

వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్ల నుంచి వచ్చే పొగ కారణంగా 12 గంటల నుంచి 24 గంటలలోపు దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ లక్షణాలు తాత్కాలికమే అయినప్పటికీ, నిపుణులు ఈ పరిస్థితి వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెబుతుండగా, మరికొందరు మాత్రం టెఫ్లాన్ ఫ్లూ భవిష్యత్ లో మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

   ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : polycystic-ovary-disorder america cooking human-body high-fever pfas flu polymer-fume-fever united-states nonstick-pans teflon-flu polytetrafluoroethylene ptfe poly-fluoroalkyl-substances muscle-pain

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com