పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్ జారీ.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మే నెల మొదలైంది.. దీంతో ఎండలు తీవ్రంగా పెరుగుతు న్నాయి. ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎండలు మండిపోవడంతో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 45డిగ్రీలకు పైగా నమోదవు తున్నాయి. దీంతో వేసవి తాపానికి జనాలు అల్లాడుతున్నారు. భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. 

ఇది కూడా చదవండి.. ఇన్ హేలర్లు ఎలాంటి వాళ్లకు అవసరం..?  

వచ్చే 24 గంటల్లో.. 

ఈ రోజు చాలా రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్, ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో వచ్చే 24 గంటల్లో మంచు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేశారు. అదే స‌మ‌యంలో మే నెల ప్రారంభం ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఊరటనిచ్చింది. రోజంతా ఎండ ఉన్నప్పటికీ ఈదురు గాలులు వీయడంతో ఉష్ణోగ్రత పెరగలేదు. పర్వతాలలో మంచు కురుస్తున్న కారణంగా చల్లని వర్షం కారణంగా, బుధవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. 

మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ విశ్లేషణ (ఈ రోజు ఉదయం8:30 గంటల ఆధారంగా) ద్రోణి ఒకటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు. 
 
 వాతావరణ హెచ్చరికలు..   

తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. ఈ రోజు, రేపు ,ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. రాబోయే మూడురోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు హెచ్చరికలు జారీ చేశారు. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.