ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

షేర్ చేయండి:
ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

సాక్షి లైఫ్ : ఈ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం పెద్దవారికి మత్రమే పరిమితం కాదు, వేడి వల్ల సులువుగా సమస్యల బారిన పడే వారిలో పసిపిల్లలు,బాలింతలు కూడా ఉన్నారు. పసిపాపలకి చక్కని హైడ్రేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వారి చిన్ని శరీరాలు డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

చిన్నపిల్లలకి తేలికగా ఉండి, గాలి ఆడే అనువైన బట్టలు వేయడం ఇంకా వారికి నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, ఎక్కువ వేడికి గురి కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే, పసిపాపల ఆకలి తీరేలా తల్లిపాలు పట్టే లేదా ఫార్ములా ఆహారం తినిపించే చిన్న పిల్లలకు తరచుగా పాలు పట్టడం లేదా తినిపిస్తే వారికి తగినంత హైడ్రేషన్‌తో పాటు పోషకాహారం కూడా అందించవచ్చు. 

 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

కానుపు తరువాత.. 


బాలింతలకు కానుపు తరువాత, ముఖ్యంగా అది వేసవి కాలం అయితే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు త్వరగా కోలుకొనేందుకు ఇంకా బిడ్డకు తల్లి పాలు పట్టేలా చేసేందుకు, వారికి సరైన హైడ్రేషన్, పోషకాహారం అందించడం ఇంకా విశ్రాంతి అవసరమవుతాయి. 

పిల్లల ఆలనా పాలనలో..

శారీరకంగా కష్టంగా ఉండే పనులకు వారిని దూరంగా ఉంచడం ఇంకా పిల్లల ఆలనా పాలనలో వారు తగిన సహాయం పొందేలా మసలుకొంటే వారిలోని అలసటను ఒత్తిడిని తగ్గించవచ్చు. అంతే కాకుండా, తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం, వైద్యులు లేదా ఆరోగ్య సహాయ సంఘాల నుంచి తగిన సహాయం పొందడం వల్ల వారు ఎండాకాలంలో కొత్తగా ఎదురయ్యే బాలింత సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చని ఓమ్ని హాస్పిటల్స్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.నాగవేందర్ రావు చెబుతున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకొనే విషయంలో..

ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకొనే విషయంలో రకరకాల ఆరోగ్య పరిస్థితులు, వేరువేరు వయసులలో ఉన్న వారిలోని అనేక అంశాలను లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది. వెనువెంటనే సమస్యకు తగిన రీతిగా ప్రతిస్పందించడం, సమాచారాన్ని త్వరగా చేరవేయడం ఇంకా అవసరమైనప్పుడు తగిన సహాయం అడగటం ద్వారా, ప్రతీఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వేసవి కాలాన్ని ఆనందంగా గడిపేయొచ్చు.

ఇది కూడా చదవండి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.