నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్ భాష.. 

షేర్ చేయండి:
నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్ భాష.. 

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా నేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నర్సింగ్ కళాశాలల గురించి ఆయన సమీక్ష నిర్వహించారు. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి అధిక డిమాండ్ ఉందని, ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం మనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. ఇది తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ఆసుపత్రుల పర్యవేక్షణకు యాప్, నెలవారీ సమీక్షలు.. 

ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యా, వైద్య రంగాలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని పునరుద్ఘాటించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.