ఆ రాష్ట్రంలో మరింతగా పెరుగుతున్న జేఎన్.1కేసులు..   

షేర్ చేయండి:
 ఆ రాష్ట్రంలో మరింతగా పెరుగుతున్న జేఎన్.1కేసులు..   

సాక్షి లైఫ్ : దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 761 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం, 760 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 12 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,423కి తగ్గాయి. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

కేరళలో.. 

ప్రస్తుతం కేరళలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య 1,249. కర్ణాటకలో యాక్టివ్ రోగుల సంఖ్య 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్ లో 128, ,ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 2, సమాచారం ప్రకారం, కేరళలో గత 24 గంటల్లో ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

దేశవ్యాప్తంగా న్యూ వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలోని 12 రాష్ట్రాల్లో 619 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కేరళలో 148, కర్ణాటకలో 119,మహారాష్ట్రలో 110,గోవాలో 47, గుజరాత్ లో 36, ఆంధ్రప్రదేశ్ లో 30, తమిళనాడులో 26,ఢిల్లీ లో 15, రాజస్థాన్ లో 4, తెలంగాణలో 2, ఒడిశా లో ఒకటి, హర్యానాలో ఒకటి నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.