ఎమ్ పాక్స్ ఇక అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన..
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ఎమ్ పాక్స్‌ను ఇకపై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించడం లేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూ హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్ శుక్రవారం ప్రకటించారు.గత సంవత్సరం ఆగస్టులో ఎమ్ పాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
అయితే ఇటీవల కాంగో, బురుండి, సియెర్రా లియోన్, ఉగాండ వంటి ప్రభావిత దేశాల్లో కేసులు గణనీయంగా తగ్గాయి. ఎమ్ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది సోకిన వ్యక్తిని తాకడం వల్ల వ్యాపిస్తుంది. లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి లాంటి ఫ్లూ లక్షణాలతో పాటు చీముతో నిండిన బొబ్బలు, దద్దుర్లు లాంటివి వస్తాయి.
తగ్గుముఖం పట్టడంతో..
గత సంవత్సరం కాంగోలో మొదలైన ఎమ్ పాక్స్ కొత్త వేరియంట్ పొరుగు దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ఏడాది వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ఆయా దేశాలు తీసుకున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రతి మూడు నెలలకు ఒకసారి వ్యాప్తిని సమీక్షించే అత్యవసర కమిటీ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి అనేది డబ్ల్యు హెచ్ ఓ ఇచ్చే హెచ్చరిక. ప్రస్తుతం ఎమ్ పాక్స్ పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది డబ్ల్యు హెచ్ ఓ.
ఇది కూడా చదవండి.. మెడిసిన్స్ లేకుండా హైబీపీని తగ్గించే చిట్కాలు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
