వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం అందరికీ కొన్ని ఆరోగ్య సమస్యలు తెస్తుంది, వాటిలో అజీర్ణం కూడా ముఖ్యమైనది. వాతావరణంలో అధిక తేమ వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది, శరీరంలో బ్యాక్టీరియా పెరుగుతుంది, తద్వారా అనారోగ్యాలు తలెత్తుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా  వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఈ కాలంలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు.. అవేంటంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఓట్స్.. 

 ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవే, కానీ కొన్ని సార్లు ఇవి అజీర్ణం సమస్యకు కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వర్షాకాలంలో ఓట్స్‌ను తగ్గించడం ఉత్తమం.

జొన్నలు.. 

 జొన్నలు కూడా అజీర్ణ సమస్యలను పెంచుతాయి. వర్షాకాలంలో అధిక పిండి పదార్థం కలిగిన జొన్నలు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

జంక్ ఫుడ్.. 

మైదా పదార్థాలతో తయారైన జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి మరింత పెరుగుతాయి. నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణ సమస్యలను పెంచుతాయి.

గోధుమలు.. 

గోధుమల్లో గ్లూటాన్ అధికంగా ఉంటుంది, ఇది ఉబ్బరం మరియు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్లూటాన్ సెన్సిటివిటీ ఉన్న వారిలో అజీర్ణం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో బ్రెడ్, పేస్ట్రీలు వంటి గోధుమ ఉత్పత్తులను తగ్గించడం మంచిది.

బార్లీ.. 

 బార్లీలో పోషకాలు చాలా ఉన్నాయి కానీ, వర్షాకాలంలో ఇవి జీర్ణం కావడం కష్టం. బార్లీతో తయారు చేసిన ఆహారాలు జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించవచ్చు. తద్వారా గ్యాస్ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

మిల్లెట్స్.. 

 మిల్లెట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి.  కానీ జీర్ణం కావడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి అరుగుదల తక్కుగ ఉన్నవాళ్లు వర్షాకాలంలో చిరుధాన్యాలు తినకుండా ఉండటం మంచిది.ఈ సీజన్లో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం, వేయించిన ,జంక్ ఫుడ్స్‌ను తగ్గించడం ద్వారా అజీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.