ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
సాక్షి లైఫ్ : పండ్లు లేదా వాటితో తయారు చేసిన జ్యూస్‌లు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని అందరికీ తెలుసు. ఐతే తాజా పండ్లతో చేసిన జ్యూస్ తాగడం మంచిదే. కానీ, మారుతున్న జీవనశైలి కారణంగా, ప్రస్తుతం ప్యాకేజ్డ్ జ్యూస్‌ల ట్రెండ్ ప్రజల్లో పెరిగింది. ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడంవల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే నష్టాలు..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, రసాలు మొదలైనవాటిని చేర్చుకుంటాము. ఆరోగ్యంగా ఉండటానికి, చాలా మంది ప్రజలు ప్రతిరోజూ జ్యూస్ తాగుతారు, దానిని వారి ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేసుకుంటారు. అయితే రోజువారి రద్దీ, బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతిరోజూ తాజా పండ్లరసాలు తాగడం అందరికీ సాధ్య పడకపోవడంతో ప్యాక్డ్ జ్యూస్ ట్రెండ్ జనాల్లో విపరీతంగా పెరిగింది.
అధిక చక్కెర కంటెంట్..
ప్యాక్డ్ జ్యూస్ రుచిగా ఉండటమే కాకుండా, నిల్వ చేయడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ అవి అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. ఎందుకంటే..? ప్యాక్ చేసిన రసాలలో వేసిన చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, దీనికారణంగా బరువు పెరగడంతోపాటు,టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని గణనీయంగా పెంరుగుతుంది.
ఆరిఫిషియల్ ఫ్లేవర్స్..
కొన్ని ప్యాక్ చేసిన జ్యూస్‌ల కృత్రిమ రుచి, రంగు కోసం కెమికల్స్ కలూపుతూ ఉంటారు. ఇవి అలెర్జీలు లేదా కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తాయి.
దంత సమస్యలు..
ప్యాక్ చేసిన జ్యూస్‌లలోని అధిక చక్కెర, ఆమ్లత్వం దంతాల ఎనామిల్‌ను నాశనం చేస్తాయి, ఫలితంగా కావిటీస్, ఇతర దంత సమస్యలు వస్తాయి.
ఫైబర్ లేకపోవడం..
తాజా పండ్ల వలె కాకుండా, ప్యాక్ చేసిన రసాలలో సాధారణంగా ఫైబర్ ఉండదు, ఇది మెరుగైన జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు అవసరం. కానీ ఇలాంటి ప్యాక్డ్ జ్యూస్ లలో ఫైబర్ ఉండదు.
పోషకాహార లోపాలు..
ప్యాక్ చేసిన జ్యూస్‌లు తయారుచేసే సమయంలో పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజాలను కోల్పోతాయి, తాజా పండ్ల రసం కంటే తక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం..
ప్యాక్డ్ జ్యూస్‌లలో ఉపయోగించే అధిక చక్కెర ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, పదేపదే తాగడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇది కూడా చదవండి..ఒమేగా-3లో ఎన్నిరకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
