Obesity : స్థూలకాయానికి ముకుతాడు వేయాల్సిందే..! లేదంటే ప్రాణాలకు ముప్పే.. 

షేర్ చేయండి:
Obesity : స్థూలకాయానికి ముకుతాడు వేయాల్సిందే..! లేదంటే ప్రాణాలకు ముప్పే.. 

సాక్షి లైఫ్ : గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అందరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ విషయంలో పెద్దా, చిన్నా అనే తేడాలేదు.. దీనికారణంగానే ఊబకాయ సమస్య, మెటబాలిక్ డిసీజెస్ సమాజ ఆరోగ్యానికి పెను సవాలుగా మారాయని నిపుణులు హెచ్చరించారు. స్థూలకాయాన్ని కేవలం క్లినికల్ విధానాలతోనే నయం చేయలేము. దీనికి పలురకాల క్రమశిక్షణ అవసరం.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

 

శాస్త్రీయ ఆవిష్కరణలు, నివారణ చర్యలు, ప్రజల్లో అవగాహన కలిగినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని  ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 
 గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రిలో డిసెంబరు 17, 18 తేదీల్లో నిర్వహించిన ‘గట్‌ అండ్‌ మెటబాలిక్ సమ్మిట్ - 2025’లో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం మందుల ద్వారానే కాకుండా, జీవనశైలిలో మార్పులు, శాస్త్రీయ పద్ధతుల ద్వారానే ఈ సమస్యను అధిగమించగలమని స్పష్టం చేశారు.

సమగ్ర వ్యూహంతోనే నివారణ.. 

ఈ సదస్సులో ఊబకాయంపై పోరాటానికి పలు అత్యాధునిక అంశాలను తెరపైకి తెచ్చారు. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మన జీవక్రియను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో జన్యుపరమైన విశ్లేషణ చేసి, ఎవరికి ఏ రకమైన పోషకాహారం అవసరమో (Personalized Nutrition) నిర్ణయించవచ్చని తెలిపారు. బేరియాట్రిక్ సర్జరీలతో పాటు ఎండోస్కోపిక్ విధానాల ద్వారా సులభంగా బరువు తగ్గే మార్గాలను వివరించారు.

ఊబకాయం అనేది కేవలం అనారోగ్య సమస్య మాత్రమే కాదు, అది సామాజిక, ఆర్థిక భారం కూడా అని వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బరువు తగ్గడం అనేది కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకూడదని, ప్రతి ఇంటిలోనూ అవగాహన పెరగాలని వారు అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఊబకాయ సమస్యను తరిమికొట్టాలని,  పాఠశాల స్థాయి నుంచే ఆహార నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని వైద్యనిపుణులు సూచించారు.

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.