కర్ణాటకలో డెంగ్యూ కేసుల నియంత్రణపై దృష్టి పెట్టిన అధికారులు..
సాక్షి లైఫ్ : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి ప్రకారం డెంగ్యూలో మరణాల రేటు 0.5 శాతానికి మించకూడదు. కర్ణాటకలో మరణాల రేటు పరిమితి కంటే చాలా తక్కువగా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 0.09 శాతంగా ఉంది ”అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు, చిక్కమగళూరు, మైసూరు, హావేరి, శివమొగ్గ, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవడంతో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 5,374కి చేరగా, ఐదుగురు మరణించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధిలో 1,230 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి..డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..?
వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం సీఎం మాట్లాడారు. "ప్రభుత్వం డెంగ్యూ కేసులను సీరియస్‌గా తీసుకుంది ,ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది" అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని చికిత్సలు ,మందులు అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో డెంగ్యూ పరిస్థితిపై సంయుక్తంగా సమీక్షించాలని ఆయన బీబీఎంపీ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలు పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మురుగు నీటి నిల్వలను నివారించాలని కోరారు. వ్యాధి నియంత్రణకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి శుక్రవారం ఇంటెన్స్ సోర్స్ రిడక్షన్ యాక్టివిటీ కోసం ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించాలని కూడా నిర్ణయించారు.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
అంతకుముందు దినేష్ గుండూరావు ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి డెంగ్యూ పరీక్షలను పెంచాలని, ప్రాథమిక దశలోనే గుర్తించాలని ఆదేశించారు. డెంగ్యూ విషయంలో ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూకు సరిపడా మందులు ఉండేలా చూడాలని, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఇంటింటికీ డెంగ్యూ సర్వే నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
