రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కరోనా పాజిటివ్
సాక్షి లైఫ్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని భజన్‌లాల్ చెప్పారు. వర్చువల్ మాధ్యమం ద్వారా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏమిటి..?
భజన్‌లాల్ శర్మ X( ట్విట్టర్)లో ఇలా రాశారు. 'ఈ రోజు పరీక్ష చేయించుకున్న తర్వాత, రిపోర్ట్ లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను, వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. నేను వర్చువల్ మాధ్యమం ద్వారా రాబోయే అన్ని ప్రోగ్రామ్‌లలో పాల్గొంటాను." అని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పేర్కొన్నారు.
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ భజన్‌లాల్ పోస్ట్ కు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని మరొక పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ అకౌంట్ లో రాశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను."అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
