ఆ మూడు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..    

సాక్షి లైఫ్ : ఢిల్లీలో గత 24 గంటల్లో 63 కరోనా కొత్త కేసులు నమోద య్యాయి. గత సంవత్సరం మేనెలతో పోలిస్తే రోజువారీ మొత్తం కేసులు మరింతగా పెరిగాయి. ఒక్క ఢిల్లీ నగరంలోనే కాకుండా ఇతర ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. మే 2023లో ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 50 కంటే ఎక్కువగా ఉంది.
 
ఇప్పటివరకూ ఢిల్లీలో 459 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు 15 రోజుల్లో 191, గత 15 రోజుల వ్యవధిలో 73 కేసులు వచ్చాయి.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..గత నెలరోజుల్లో 96 కేసులు రాగ , 27 నుంచి గత 15 రోజుల్లో 226 కేసులు నమోదయ్యాయి. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.


ఇది కూడా చదవండి.. ఆఫీస్ లో వర్క్ చేసే గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు..

శీతాకాలంలో..

ఢిల్లీలో 2023మేలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 50 కంటే ఎక్కువగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా మార్చిలో ప్రారంభమై ఏప్రిల్ మధ్యలో గరిష్ట స్థాయికి చేరిన దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతున్న దశలో 12,500 కేసులు నమోదయ్యాయి. శీతాకాలంలో (డిసెంబర్-జనవరి) కేసులు మళ్లీ పెరిగాయి. అత్యధిక రోజువారీ సంఖ్య డిసెంబర్ 30న భారతదేశం అంతటా కేవలం 841 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ సమయంలో ప్రత్యేకించి కేరళ నుంచి అత్యధిక కేసులు వచ్చాయి.

రెండు నెలల తర్వాత..

రెండు నెలల తర్వాత, ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా మళ్లీ కనిపిస్తోంది. ఢిల్లీ, రాజస్థాన్‌తో పాటు యూపీ, బీహార్‌లలో సంఖ్య పెరుగుతోంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 4 వరకు 15 రోజుల వ్యవధిలో యుపిలో కేవలం 12 కేసులు నమోదయ్యాయి. 15 రోజుల్లో (ఫిబ్రవరి 4-19) 36కి పెరిగింది. ఆ తర్వాత పక్షం రోజుల్లో (ఫిబ్రవరి 19-మార్చి 5) 164 కి పెరిగింది. అదేవిధంగా, బీహార్‌లో గత 15రోజుల్లో 14 నుంచి 103కి పెరిగాయి.

కర్ణాటకలో 15 రోజుల వ్యవధిలో 268 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 959 నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 45 రోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. రాష్ట్రంలో గత నెలరోజుల్లో 496 కేసులు వచ్చాయి.

 ఇది కూడా చదవండి.. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏమిటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : corona-latest-updates latest-corona-cases delhi rajasthan
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com