Supreme Court : ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుల్స్.. ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయంలో ఇంత అలసత్వం ఎందుకు అని సుప్రీంకోర్టు Food Safety and Standards Authority of India(FSSAI)ను నిలదీసింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై (packaged food products) ముందు భాగంలో స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్‌ను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.

జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, దానిని ఆచరణలో పెట్టడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

కోర్టు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు..

నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కంపెనీలకు ఏడాది పాటు మినహాయింపు ఇవ్వడంపై కోర్టు ప్రశ్నించింది. గత నాలుగేళ్లుగా ఏం చేశారు..?.. 2022 నుంచి ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఆచరణీయమైన పురోగతి లేకపోవడాన్ని తప్పుబట్టింది. మళ్లీ అభ్యంతరాల ప్రక్రియ ఎందుకు..?..కొత్తగా మళ్లీ అభ్యంతరాలు కోరి, విచారణల పేరుతో సమయం వృథా చేయడం తగదని అభిప్రాయపడింది.

కొత్త హెక్సాగోనల్ హెచ్చరిక లేబుల్స్ ప్రతిపాదన..

2022లో ప్రతిపాదించిన 'స్టార్-రేటింగ్' విధానానికి బదులుగా, ఇప్పుడు కొత్తగా ప్రమాణాలు రూపొందించారు. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు (fat) ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ముందు భాగంలో తెలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో కూడిన ఎరుపు రంగు షట్కోణ (red hexagonal warning symbol) హెచ్చరిక చిహ్నాన్ని ముద్రించాలని ప్రతిపాదించారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసే ఆహారంలో హానికరమైన పదార్థాలు అధికంగా ఉన్నాయా లేదా అని స్పష్టంగా తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందుకు సాగుతున్న తీరు..

డ్రాఫ్ట్ నిబంధనలను ఖరారు చేసి విడుదల చేయడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ కోర్టుకు తెలిపింది. దేశీయ వాటాదారులు, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ డ్రాఫ్ట్‌ను 60 రోజుల పాటు ప్రజల ముందు ఉంచనున్నట్లు పేర్కొంది.

'3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ' అనే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఈ పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై తప్పనిసరిగా ఎఫ్‌ఓపీఎల్‌ను (FoPL - Front-of-Pack Labelling) అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తన తీర్పును రిజర్వ్ చేసింది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.