Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
సాక్షి లైఫ్ : కాపర్ బాటిల్‌లో కేవలం సాధారణ నీటిని మాత్రమే నిల్వ ఉంచాలి. డిటాక్స్ వాటర్ తయారు చేయడానికి మనం ఉపయోగించే నిమ్మ, నారింజ, ఉసిరి వంటి సిట్రస్ జాతి పండ్లలో సహజంగానే ఆమ్లాలు (acidic ingredients) ఉంటాయి. ఈ ఆమ్ల పదార్థాలను రాగి పాత్రలో వేసి ఎక్కువసేపు ఉంచినప్పుడు, అవి రాగితో రసాయనిక చర్యకు గురవుతాయి. ఫలితంగా నీటిలో రాగి (copper) గాఢత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
పొంచి ఉన్న 'కాపర్ టాక్సిసిటీ' ముప్పు..
శరీరానికి రాగి అవసరమే అయినప్పటికీ, అది మోతాదుకు మించితే 'కాపర్ టాక్సిసిటీ' (copper poisoning) బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణకోశ సమస్యలు..
మోతాదుకు మించి కాపర్ శరీరంలోకి వెళితే వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, డయేరియా, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. నోట్లో అదో రకమైన లోహపు రుచి కూడా అనిపిస్తుంది.
అవయవాలపై భారం..
దీర్ఘకాలం పాటు ఈ విధమైన నీటిని తాగడం వల్ల శరీరంలో చేరిన అదనపు రాగి.. కాలేయం (liver), మూత్రపిండాలపై (kidneys) తీవ్ర ప్రభావం చూపుతుంది.
కాపర్ బాటిల్‌లో ఏవి ఉంచకూడదు..?
కాపర్ బాటిల్‌లో కేవలం రాత్రంతా నిల్వ ఉంచిన సాధారణ నీటిని మాత్రమే తాగాలి. కింది వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాగి పాత్రల్లో నిల్వ చేయకూడదు.
నిమ్మరసం, నారింజ రసం
పండ్లు, కూరగాయల ముక్కలు వేసిన డిటాక్స్ వాటర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా సాధారణ వెనిగర్ కలిపిన నీరు
ఉసిరి లేదా ఇతర పుల్లటి పండ్ల రసాలు
సోడా లేదా ఎలాంటి కార్బోనేటెడ్ పానీయాలు
మీరు డిటాక్స్ వాటర్ లేదా నిమ్మరసం తాగాలనుకుంటే, వాటిని నిల్వ చేయడానికి గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ బాటిల్స్ వాడటం అత్యుత్తమమైన మార్గం.
కాపర్ వాటర్ బాటిల్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
కాపర్ బాటిల్‌ను క్రమం తప్పకుండా చింతపండు లేదా నిమ్మకాయ-ఉప్పు మిశ్రమంతో లోపల, బయట శుభ్రం చేసుకోవాలి. నీటిని రోజుల తరబడి అందులోనే ఉంచేయకూడదు. ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుకోవాలి. రోజంతా కాపర్ బాటిల్‌లోని నీటినే తాగడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే సరిపోతుంది. ఇప్పటికే కాలేయం లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు రాగి పాత్రలో నీరు తాగే ముందు తప్పనిసరిగా తమ వైద్యుడిని సంప్రదించాలి. డిటాక్స్ వాటర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాన్ని సరైన పాత్రలో నిల్వ చేసుకుని తాగినప్పుడే దాని పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందుతాయని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
