సాక్షి లైఫ్ : హిమోఫిలియా, ఇతర రక్తస్రావ రుగ్మతల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాధి గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, హిమోఫిలియా కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి ఈ డే ని జరుపుతారు.
హిమోఫిలియా అనేది అరుదైన రక్త రుగ్మత, ఇది రక్తం సరిగ్గా గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గడ్డకట్టే కారకాలలో లోపం వల్ల సంభవిస్తుంది, ఇది దీర్ఘకాలిక రక్తస్రావంకి దారితీస్తుంది. తెలిసిన చికిత్స లేనప్పటికీ, చికిత్స పరిస్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం 2024 థీమ్
“ఈక్వటెబుల్ యాక్సిస్ ఫర్ ఆల్" అంటే అందరికీ సమానమైన ప్రాప్యత. అన్ని రకాల రక్తస్రావ రుగ్మతలను గుర్తించడం”. ఇది అందరికీ చికిత్సను గురించి నొక్కి చెప్పడం, వారసత్వంగా వచ్చే రక్తస్రావ రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి వారి రక్తస్రావం పరిస్థితి, లింగం, వయస్సు లేదా స్థానంతో సంబంధం లేకుండా సంరక్షణ కల్పించడం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం 2024 థీమ్ తో ఈ ఏడాది జరుపుతున్నారు.
హిమోఫిలియా ఉన్నవ్యక్తి జీవిత కాలం ఎంత..? హిమోఫిలియా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? హిమోఫిలియా ఉన్నవారు ఏమేం చేయకూడదు.. హిమోఫిలియాకు మొదటి చికిత్స ఏమిటి..? వ్యాధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
హిమోఫిలియా..?
హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధులలో ఒకటి. 20వేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశా లుంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాలు, జాయింట్‌ల వద్ద దెబ్బలు తగిలితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఈ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రక్తం గడ్డకట్టే విధానాన్ని కోల్పోవడం వల్ల తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అవసరమైన వారికి కోల్పోయిన బ్లడ్ ఫ్యాక్టర్స్ ఎక్కించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com