సాక్షి లైఫ్ : అన్నిసీజన్లలో ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయలు, పండ్లు ఉన్నాయి. అటువంటి వాటిలో బీట్ రూట్ , క్యారెట్ చాలా ప్రధానమైనవి. పండ్ల విషయంలో యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు ఇది. ఈ మూడురకాల జ్యూస్ లు తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..?
బీట్‌రూట్ జ్యూస్..
శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణాలు బీట్ రూట్ లో ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతాయి. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, జీవక్రియనుమెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
యాపిల్ జ్యూస్..
ఈ జ్యూస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
క్యారెట్ జ్యూస్..
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ విటమిన్ "ఏ" ఎక్కువగా లభిస్తుంది. అంతేకాదు కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ కంటెంట్ కు క్యారెట్ మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరంలో ఉండే విషాన్ని తొలగిస్తాయి.
ఇది కూడా చదవండి.. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com