స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఇందులో ఒక రకం స్కిన్ క్యాన్సర్. కేసులు భారతదేశంలో స్కిన్ క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ స్కిన్ క్యాన్సర్ గురించి జనాల్లో సరైన అవగాహన లేకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి స్కిన్ క్యాన్సర్ కు కారణాలు, లక్షణాలు, కొన్ని నివారణ పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'చర్మ క్యాన్సర్' అంటే..?
శరీరంలోని డి.ఎన్.ఏ దెబ్బతినడం వల్ల కణాలు అసాధారణంగా పెరుగుతాయి. ఇది స్కిన్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. సూర్యరశ్మి తగలని శరీరంలోని భాగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
స్కిన్ క్యాన్సర్ లక్షణాలు..?
- శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా దురద ఉంటుంది.
- చర్మంపై మండుతున్నట్లు అనిపిస్తుంది.
- చర్మంపై కొత్త మచ్చలు లేదా దద్దుర్లు ఏర్పడుతాయి.
- చర్మపై గాయాలు మానాలంటే చాలా కాలం పడుతుంది.
-చెవులు, మెడ లేదా ప్రైవేట్ భాగాల చుట్టూ మచ్చలు లేదా ఎర్రటి పాచెస్ వస్తాయి.
చర్మ క్యాన్సర్ కారణాలు..
సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాల వల్ల కూడా శరీరంలోని డి.ఎన్.ఏ దెబ్బతినడం కారణంగా స్కిన్ క్యాన్సర్ వస్తుంది.
- ఫెయిర్ స్కిన్‌లో మెలనిన్ తక్కువగా ఉంటుంది. స్కిన్ పిగ్మెంట్ స్కిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- చర్మంలో అనూహ్యంగా కొన్నిరకాల మార్పులు చోటుచేసుకుంటాయి.
-ఎక్కువ సేపు ఎండలో ఉండడం వల్ల కూడా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కూడా స్కిన్ క్యాన్సర్ కు కారణం కావచ్చు.
-ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..?
- ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా కూడదు.
-మంచి పోషకాహారం ఆహారం తీసుకోవాలి.
-ఎండలో శరీరం నిండుగా ఉండే దుస్తులను ధరించాలి.
-శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి, అందుకోసం పుష్కలంగా నీరు తాగాలి.
- స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి.
- రెగ్యులర్ గా స్కిన్ చెకప్‌లు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
