కరివేపాకుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : కరివేపాకు ఆహారం రుచిని పెంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా దక్షిణ భారత వంటకాల్లో వినియోగిస్తారు. ఈ ఆకులో అనేక అద్భుతమైన పోషకాలున్నాయి. చాలామంది అందుకే దీనిని పలు విధాలుగా తమ రోజువారీ ఆహారంలో తీసుకుంటారు. భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కరివేపాకు వీటిలో ఒకటి. కరివేపాకులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రజలు సాధారణంగా తినడానికి ఉపయోగిస్తారు. అయితే, ఆహారంతో పాటు, దాని నీరు కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
కరివేపాకులో అవసరమైన విటమిన్లు శరీరంలోని డెన్సిటీ లిపో ప్రోటీన్ (చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు) తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి
కరివేపాకు నీరు: ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలున్నాయి. కరివేపాకు నీరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం లాంటిది. ఈనీరు ఉదయాన్నే తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
డయాబెటిక్ సమస్య ఉన్నవారికి కరివేపాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకు కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా విభజించడాన్ని నెమ్మదిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు రావు..
కరివేపాకులో డైజెస్టివ్ ఎంజైములు ఉంటాయి, ఇవి అజీర్ణం,కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలున్నవాళ్ళు కరివేపాకు నీరు తాగడం వల్ల ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది అనేక జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
దగ్గు, జలుబుకు సరైన పరిష్కారం..
మీరు దగ్గు ,జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, కరివేపాకు నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి జలుబు సమయంలో మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బరువు తగ్గడానికి ..
కరివేపాకు కొవ్వును సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో బయోయాక్టివ్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆకలిని తగ్గించి,ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.
ఆరోగ్యానికి..
కరివేపాకులో విటమిన్ "ఏ" సమృద్ధిగా లభిస్తుంది, ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. కరివేపాకు నీరు తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఐరన్ లోపం తలెత్తే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి.. ప్యాకెట్ పాలు లేదా తాజా పాలు..? ఆరోగ్యానికి ఏవి మంచివి..?
జుట్టుకు ప్రయోజనకరమైనది..
కరివేపాకు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. కరివేపాకు నీటిలో బీటా కెరోటిన్,ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి, ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
