సాక్షి లైఫ్ : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి ఎముకలకు బలాన్ని ఇవ్వడమేకాకుండా, మెదడు ను చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏ పాలు తాగాలి..? అనే చిక్కు ప్రశ్న తలెత్తుతుంది. మార్కెట్లో దొరికే పాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ప్యాక్ చేసిన పాలు, ఇంకొకటి తాజా పాలు. మరి వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్యాక్డ్ మిల్క్ vs ఫ్రెష్ మిల్క్: పాలు ఆరోగ్యానికి ఎంత పోషకమైనవో అందరికీ తెలిసిందే. ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్లు , మినరల్స్ వంటివి పాలలో పుష్కలంగా ఉంటాయి. అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు చిన్నతనం నుంచే వారి రోజువారీ ఆహారంలోభాగంగా పాలను కూడా అందిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారంలో పాలు రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఏ పాలు తాగాలి..? ఏ పాలు మంచివి..?
'ప్యాక్డ్ మిల్క్' అంటే..?
ప్యాక్ చేసిన పాలు మార్కెట్‌లో ఎక్కడకావాలంటే అక్కడ దొరుకుతు న్నాయి. ప్యాకెట్ పాలను అనేక విధానాల ద్వారా తయారు చేస్తారు. నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన తర్వాత, వెంటనే చల్లని ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి, ప్రాసెస్ చేసిన పాలను ప్యాక్ చేస్తారు. దీని కారణంగా అందులో ఉండే బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఇలాంటి పాలను ఫుల్ క్రీమ్, టోన్డ్ లేదా డబుల్ టోన్డ్ మిల్క్ రూపంలో మార్కెట్‌లో అమ్ముతుంటారు.
'తాజా పాలు' అంటే ఏమిటి..?
తాజా పాలు అంటే..? ఈ పాలను స్థానిక పాల కేంద్రాల ద్వారా పశువుల నుంచి నేరుగా వినియోగదారునికి విక్రయిస్తారు. ఇందులో ఎలాంటి మెకానికల్ రోల్ కనిపించదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. సాధారణంగా ఇది ప్యాక్ చేసిన పాల కంటే మెరుగైనవిగా పరిగణిస్తారు. ఇది సేంద్రీయ పద్ధతిలో ఉత్పత్తి చేసినవి కాబట్టి ఈ పాలు ఆరోగ్యానికి ఉత్తమం.
రెండింటిలో ఏది మంచిది..?
శరీరానికి పాలు తీసుకోవడం చాలా అవసరం, కానీ మీరు వాటిని ఏ రూపంలో తీసుకుంటారనేది కూడా ముఖ్యం. స్థానిక డెయిరీ లనుంచి సేకరించిన తాజా పాలు చాలా మంచివి. కానీ జంతువులకు ఇచ్చే ఇంజెక్షన్లు,వాటి మేతలో కల్తీ కారణంగా, ఒక్కోసారి ఆపాలు అనారోగ్యానికి కారణం కావొచ్చు. తరచుగా పాల యజమానులు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి తమ పశువులను బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు, ఆ తర్వాత అవి చెత్త, చెదారం తినవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఆ పాలు ఆరోగ్యానికి హానికరంగా భావించాల్సి వస్తుంది.
ప్యాక్‌డ్ మిల్క్ గురించి చెప్పాలంటే, పాశ్చరైజింగ్, హోమోజెనైజ్ చేయడం ద్వారా తయారుచేసే విధానం వల్ల, దానిలో బాహ్య బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం లేదు, కానీ దానిలో కల్తీ జరుగుతుందని ప్రచారం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో తాజాగా దొరికే పాలే మంచివి. అంటే డెయిరీ నుంచి సేకరించిన పాలు.
ఇది కూడా చదవండి.. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ తప్పనిసరి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com