ఎండా కాలంలో కూల్ గా, హెల్తీగా ఉంచే జ్యూస్..
సాక్షి లైఫ్ : ఇక ఎండాకాలం మొదలైంది. ఓపక్క ఎండలు తీవ్రంగా పెరుగుతుండడంతో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చల్లగా ఉండడంతో పాటు, వేసవి కాలంలో ఎనర్జిటిక్ గా ఉండటం చాలా అవసరం. అందుకోసం హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ పానీయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సొరకాయ రసం..
సొరకాయ రసం ఖాళీ కడుపుతో తాగాలి. ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎండ దెబ్బ తగలకుండా చేస్తుంది.
సొరకాయ రసం ఎలా తయారు చేయాలి..?
సొరకాయను బాగా కడగాలి. పీలర్ సహాయంతో పొట్టు తీయండి. ఇప్పుడు దాని గింజలను తీసి చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ ముక్కలను జ్యూసర్‌లో వేయండి. దానికి కొంచెం నీరు పోసి మెత్తగా అయ్యేవరకు ఉంచాలి. ముక్కలను తొలగించడానికి ఆ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టండి. సొరకాయ రసం రెడీ. ఇలా సొరకాయ జ్యుస్ చేసుకొని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి.. విడిగా ఉండే స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం ఎక్కువ..! కారణం ఇదే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
