విడిగా ఉండే స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం ఎక్కువ..! కారణం ఇదే..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సాంగత్యం, పరస్పర చర్య చాలా ముఖ్యమని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అయిన సమయంలో అత్తమామలు, తల్లిదండ్రులు లేదా భాగస్వామి నుంచి విడివిడిగా నివసించే మహిళల్లో డిప్రెషన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.  

 అధ్యయనంలో.. 

ఒక బిడ్డ పుట్టిన తరువాత మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. శరీరంలో జరిగే మార్పుల వల్ల చాలా మంది మహిళలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ యూనివర్సిటీ అధ్యయనంలో ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 పెళ్లయిన తర్వాత.. 

ఒక స్త్రీకి పెళ్లికి ముందు తన జీవితంలో ఆమె తల్లిదండ్రులు, ఇతర బంధువులకు ప్రాముఖ్యత ఇస్తుంటుంది. పెళ్లయిన తర్వాత అత్త, మామ ఆమె తల్లిదండ్రులు ,భర్త కూడా అంతే ముఖ్యం. ఈ అధ్యయనం ప్రకారం అత్తమామలు లేదా తల్లిదండ్రులతో కలిసి జీవించడం వల్ల డిప్రెషన్‌ ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది.

 
ఫిన్లాండ్‌లోని హెల్సింకి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, డెమోగ్రాఫిక్ పరిశోధకురాలు డాక్టర్ నినా మెట్సా-సిమోలా మాట్లాడుతూ.. ఉద్యోగం చేసే మహిళకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే వారి ఆలన, పాలన చూసుకోవ డానికి ఎవరైనా పెద్దలు తల్లిదండ్రులు, అత్తా మామ ఉన్న వారికి ఎలాంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడైంది.   

తల్లి అయిన తర్వాత కొన్నాళ్ళు నిరాశను నివారించడానికి, ఒకరికొకరు మద్దతు అవసరం. అందుకోసమే అమ్మాయి తల్లి దండ్రులు లేదా ఆమె అత్తా మామలు తన దగ్గర ఉండడం ఉత్తమమని పరిశోధకులు చెబుతున్నారు.  

అత్తమామల వయస్సు.. 

ఫిన్లాండ్‌లో 4.88 లక్షల మంది చిన్న పిల్లల తల్లులను పరిశోధకులు పర్యవేక్షించారు. కొత్త తల్లులను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా..? లేదా అనే విషయాన్ని కూడా పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. ఇది కాకుండా, తల్లిదండ్రులు, అత్తమామల వయస్సు, ఆరోగ్యం, కొత్త తల్లులతో వారి అనుబంధాన్ని కూడా కొలమానంగా తీసుకున్నారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలలో డిప్రెషన్ నుంచి కొత్తగా తల్లులైన మహిళల ఆరోగ్యాన్ని రక్షించడానికి పరస్పర మద్దతు అవసరమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రసవం తర్వాత.. 

ప్రసవం తర్వాత మహిళలు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వారి భాగస్వాముల నుంచి విడిపోయిన మహిళల్లో మరింతగా మానసిక సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బిడ్డ పుట్టిన తర్వాత మహిళల్లో డిప్రెషన్ అనేది సాధారణ సమస్య. కొంతమంది స్త్రీలలో ఇది చాలా కాలం పాటు కనిపించినప్పటికీ, దీనిపై శ్రద్ధ అవసరమని ఈ పరిశోధన వెల్లడిస్తోంది.

ఇది కూడా చదవండి.. మధుమేహానికి ప్రధాన కారణాలు ఈ 7 'S' లే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.