ఎండా కాలంలో ఈ ఫుడ్ అస్సలు టచ్ చేయవద్దు.. ఎందుకంటే..?    

షేర్ చేయండి:
ఎండా కాలంలో ఈ ఫుడ్ అస్సలు టచ్ చేయవద్దు.. ఎందుకంటే..?    

సాక్షి లైఫ్ : వేసవి కాలం ఉషోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మరి ఎండలు పెరుగుతున్న సమయంలో ఏమి తినాలి..?  ఏమి తినకూడదు..? ఏ ఫుడ్ మంచిది..? ఏ ఫుడ్ మంచిది కాదు..? అనేది తప్పకుండా తెలుసుకోవాలి..సమ్మర్ వచ్చిందంటే చాలు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి వాటిలో రోజువారీ ఫుడ్ మెనూ లో తప్పనిసరిగా మార్పు చేర్పులు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. పోలియో అంటే ఏమిటి..లక్షణాలు, నివారణ పద్ధతులు.. 

శరీరంలో వేడి.. 


డ్రై ఫ్రూట్స్‌కు సంబంధించి కూడా ఈ గందరగోళం ఉంటుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తినడంవల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే వేసవిలో వీటిని నానబెట్టి తినడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సమ్మర్ లో డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే.. 

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినడంవల్ల ఒంట్లో వేడి పెరిగి శరీరంపై చెమట పొక్కులు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

కేఫ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ , ఇంట్లో వేయించిన పకోడీలు లేదా పొటాటో చిప్స్,  నూనెలో వేయించిన ఆహారాలు వేసవిలో నివారించడం మంచిది. ఎందుకంటే అవి ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.


 ఇది కూడా చదవండి.. న్యూ రీసెర్చ్ : కృత్రిమ మానవ యాంటీబాడీస్ తో పాము విషాన్ని తొలగించవచ్చు.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.