సాక్షి లైఫ్ : ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పాము కాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు, అయితే ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. నాగుపాము, కింగ్ కోబ్రా, క్రైట్ వంటి అత్యంత విషపూరితమైన పాముల విషాన్ని నిర్వీర్యం చేయగల కృత్రిమ మానవ ప్రతిరోధకాలను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీనికి "95మ్యాట్ 5" అని పేరుపెట్టారు. సాంప్రదాయ ఉత్పత్తుల కంటే యాంటీబాడీల ప్రభావం దాదాపు 15 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకుల ఈ అధ్యయన ఫలితాలు సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
పరిశోధనా బృందం..
హెచ్ఐవీ, కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేసినట్లే, ఈ కొత్త యాంటీవీనమ్ పాము విషాన్ని కూడా నిష్క్రియం చేయగలదని శాస్త్రవేత్తలు తేల్చారు. వివిధ రకాల పాముల విషం నుంచి రక్షించగల యూనివర్సల్ యాంటీబాడీ సొల్యూషన్ దిశగా ఈ అధ్యయనం ముందడుగు వేస్తోందని పరిశోధనా బృందంలో భాగమైన అమెరికా స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లో పిహెచ్‌డి చదువుతున్న సెంజి లక్ష్మి మాట్లాడుతూ పాము కాటుకు చికిత్స చేయడానికి యాంటీబాడీలను అభివృద్ధి చేసే ఈ వ్యూహాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
ఇది కూడా చదవండి.. ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏమిటి..? ఎలాంటివారికి అవసరం..?
ప్రయోగం చేయడానికి..
పాము కాటు వల్ల ఎక్కువగా ప్రభావితమైన వాటిలో భారతదేశం, సహారా ఆఫ్రికా ప్రాంతాలు ఉన్నాయి. యాంటీవీనమ్‌ను అభివృద్ధి చేయడానికి గుర్రాల నుంచి తయారు చేసిన ప్రతిరోధకాలు యాంటీవీనమ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రస్తుత వ్యూహం గుర్రాల వంటి జంతువులలోకి పాము విషాన్ని ఇంజెక్ట్ చేయడం వాటి రక్తం నుంచి ప్రతిరోధకాలను సేకరిస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఐఐఎస్సీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కార్తీక్ సుంగర్ మాట్లాడుతూ.. గుర్రాలు తమ జీవితకాలంలో వివిధ బ్యాక్టీరియా, వైరస్‌లకు గురవుతాయి. కాబట్టి ప్రయోగం చేయడానికి వీటిని ఎంపిక చేసినట్లు చెప్పారు.
అత్యంత విషపూరితమైన విషంగా పరిగణించే త్రీ ఫింగర్ టాక్సిన్ (3FT) ప్రభావాలను తొలగించడం పరిశోధకుల లక్ష్యం. ఈ యాంటీబాడీ 3FT 149 వేరియంట్‌లలో 99 వేరియంట్‌లలో ప్రభావవంతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఎలుకలపై విజయవంతమైన పరీక్ష..
పరిశోధకులు జంతువుల నమూనాలపై అభివృద్ధి చెందిన ప్రతిరోధ కాలను పరీక్షించారు. కేవలం విషం ఇచ్చిన ఎలుకలు నాలుగు గంటల్లోనే చనిపోయాయని పరీక్షలో తేలింది. అయితే విషం-యాంటీబాడీ మిశ్రమం ఇచ్చినవి 24 గంటల పరిశీలన తర్వాత సజీవంగా ఉండి పూర్తిగా ఆరోగ్యంగా కనిపించాయి. ఈ బృందం తూర్పు భారతదేశంలోని కోబ్రా ,ఆఫ్రికాలోని బ్లాక్ మాంబా విషాన్ని వాటి ప్రతిరోధకాలను పరీక్షించి ఆశించిన ఫలితాలను కనుగొంది.
ఇది కూడా చదవండి.. పోలియో అంటే ఏమిటి..లక్షణాలు, నివారణ పద్ధతులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com