వాల్‌నట్స్ ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
సాక్షి లైఫ్ : ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారం తినడంవల్ల ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. రోజంతా పని చేయడానికి శక్తి కూడా అందుతుంది. అలాంటి ఆహార పదార్థాల్లో వాల్‌నట్స్ కూడా ఉన్నాయి. మెదడులా కనిపించే ఈ డ్రై ఫ్రూట్‌లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, ప్రతిరోజూ ఉదయం తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బాదంపప్పులా నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. లేదా పాలలో కూడా తినవచ్చు. వాల్‌నట్స్ ఉదయాన్నే తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చంటే..?
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉన్న ఆహార పదార్థాలలో వాల్‌నట్‌లు ఒకటి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు గుండె ను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు..
వాల్‌నట్‌లు యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ,గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి, దీని వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
శక్తికి మూలం..
వందగ్రాముల వాల్‌నట్స్ లో 654కేలరీలు ఉంటాయి. దీని కారణంగా తక్కువ పరిమాణంలో తిన్నా ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందువల్ల, ఉదయాన్నే దీన్ని తినడం వల్ల మీ రోజువారీ పని చేయడానికి తగినంత శక్తి లభిస్తుంది.
సమృద్ధిగా ఫైబర్..
వాల్‌నట్స్‌లో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియలో అలాగే బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. పీచు కారణంగా, కడుపుఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో పదే పదే ఆకలి అనిపించదు. ఈ కారణంగా బరువు అదుపులో ఉంటుంది. ఇది కాకుండా, ఫైబర్ కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచదు, కాబట్టి ఇది మధుమేహాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
విటమిన్ "ఇ"..
విటమిన్ "ఇ" వాల్‌నట్స్‌లో లభిస్తుంది. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం ముడతలను నివారించి, వృద్ధాప్య సమస్యలను నివారించడంలో విటమిన్ "ఇ" కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి.. ఎంతవరకు నిజం..? : తేనె, నెయ్యి కలిపితే విషపూరితమవుతాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
