ఎంతవరకు నిజం..? : తేనె, నెయ్యి కలిపితే విషపూరితమవుతాయా..? 

షేర్ చేయండి:
ఎంతవరకు నిజం..? : తేనె, నెయ్యి కలిపితే విషపూరితమవుతాయా..? 

సాక్షి లైఫ్ : తేనె, నెయ్యి రెండిటికీ ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వీటిలో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే తేనె, నెయ్యి కలపడం వల్ల విషపూరితంగా మారుతాయా..? ఆయుర్వేదం ప్రకారం, తేనె, నెయ్యి సమానంగా కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని భావిస్తారు. 

తేనె ,నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి ఎలా ముప్పుగా మారుతుంది.

నెయ్యి, తేనెను సమాన నిష్పత్తిలో కలపడం వల్ల విషపూరితం అవుతుంది.  ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. నెయ్యి , తేనె కలపడం వల్ల, క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే పదార్ధం శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది.

దీనికారణంగా శ్వాసకోశ సమస్యలు, కడుపునొప్పి వంటివి తలెత్తుతాయి. క్లోస్ట్రిడియం బోటులినమ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, ఇది ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు శరీరంలోని  ఆక్సిజన్ తగ్గిపోతుంది.  

ఇది కూడా చదవండి.. నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలివే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.