వేసవిలో శిరోజాల సంరక్షణకు చిట్కాలు..
సాక్షి లైఫ్ : ఎండలు రోజు రోజుకీ విపరీతంగా మండుతున్నాయి. దీని ప్రభావంతో దాహం కూడా పెరుగుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. ఈ సమయంలో చెమట ఎక్కువగా వస్తుంది. తల వెట్రుకలు కూడా ఈ చెమటకు పూర్తగా తడిసిపోయి. దుర్వాసన రావడంతోపాటు జుట్టురాలు సమస్య మొదలవుతుంది. కనుక ఎండాకాలంలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలు సమస్య నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరిస్తే కొన్నిరకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారమార్గాలు పొందవచ్చు.
హెయిర్ ఫాల్ నిరోధించవచ్చు..
-ఇరవై తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేసుకోవాలి.
-ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి.
-ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి.
గంట తరువాత నీటితో కడిగేయాలి.
-ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది.
-జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
-అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.
-ఈ విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
