నీటి వృథాను నిరోధించవచ్చు ఇలా..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా నీరు వృధా అవ్వడంతో అనేక దేశాలు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ చాలా చోట్ల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు దొరకకపోవడంతో తాగునీటి కొరత ఏర్పడుతోంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు కూడా చాలా విలువైందే.. తాగడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి లేదా వాహనాలు కడగడానికి నీటిని ఉపయోగిస్తున్నప్పుడు, నీటి పొదుపు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి.. గట్ హెల్త్ ను పెంపొందించే తమలపాకు
నీటి ఎద్దడికి ఇదొక్కటే కారణం కాదు. దీనికి, పెరుగుతున్న జనాభా, పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు, నీటి వనరులను అధికంగా దుర్వినియోగం చేయడం, పర్యావరణం దెబ్బతినడం, సరైన నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా కారణం.
భవిష్యత్తులో..
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు కారణాలు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నీటి సంరక్షణ అంటే నీరు వృధా కాకుండా కలుషితం కాకుండా నిరోధించడం.
నీటిని ఆదా చేసే మార్గాలు..
బ్రష్ చేసేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు, ఫేస్ వాష్ చేసేటప్పుడు, సింక్‌లో పాత్రలు కడగేటప్పుడు చాలాసార్లు ట్యాప్‌ని తెరిచి ఉంచుతారు. దాని వల్ల చాలా నీరు వృథా అవుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ట్యాప్ తిప్పుకోవడం ద్వారా కొంతమేర నీటి వృథాను అరికట్టవచ్చు.
షవర్‌కు బదులుగా..
స్నానం చేయడానికి, షవర్‌కు బదులుగా బకెట్, మగ్ ఉపయోగించండి. దీంతో చాలా నీరు ఆదా అవుతుంది. టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత ప్రతిసారీ ఫ్లష్ ట్యాంక్‌ని ఉపయోగించకుండా, బకెట్ తో నీరు పోయడం మంచిది.
కారును కడగడానికి..
ఇంట్లో ఎక్కడైనా నీళ్లపైపు లీకేజీ అయితే వెంటనే మరమ్మతులు చేయించండి. దీని వల్ల చాలా నీరు వృథా అవుతుంది. కారును కడగడానికి పైపుకు బదులుగా బకెట్,మగ్ ఉపయోగించండి. తక్కువ నీటితో శుభ్రంగా ఉంటుంది. ప్రతి సారీ కొన్ని కొన్ని బట్టలు ఉతకకుండా వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఉతకడం వల్ల చాలా నీరు ఆదా అవుతుంది.
ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
