ఉల్లిపాయ పొట్టుతో ఉపయోగాలెన్నో..
సాక్షి లైఫ్ : ఉల్లిపాయపొట్టు పనికిరాదని పడేయకండి.. అదేంటి..? పొట్టును పడేయకుండా ఏం చేస్తారనే సందేహం మీకు రావొచ్చు. చాలామంది ఉల్లిపాయాలు కోసేముందు దానిపై ఉండే పొట్టు ప్రయోజనాలు తెలియక తీసి పడేస్తారు. కానీ ఆ పొట్టు ఉపయోగాలు తెలిస్తే మాత్రం అస్సలు అలా చేయరు.
"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు" అంటారు. ఉల్లిపాయ మాత్రమే కాదండోయ్.. ఉల్లిపాయపై ఉండే పొట్టు అంతే మేలు చేస్తుందట. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి మరి.
యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్ వంటి లక్షణాలు ఉల్లిపాయ పొట్టులో ఉన్నాయి. ఈపొట్టు తినడం ద్వారా పలురకాల ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండొచ్చు. అంతేకాదు ఉల్లిపాయ పొట్టులో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి.
కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లిపాయ పొట్టులో క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి చర్మం, శిరోజాలకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
ఇది కూడా చదవండి..ఈ ఆహారం తీసుకుంటే..రోగనిరోధక శక్తికి తిరుగే ఉండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
