బంగాళదుంపలతో ఇన్ని దుష్ప్రభావాలున్నాయా..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల పండ్లు,కాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కొన్ని ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అటువంటి వాటిలో బంగాళాదుంప కూడా ఒకటి. దీనిని తరచుగా వివిధ వంటలలో ఉపయోగిస్తారు. అయితే బంగాళదుంప తినడంవల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల పలురకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనిని తినడం వల్ల బరువు పెరుగుతారట. బంగాళాదుంపలో ఉండే అధిక కేలరీల కంటెంట్ ఊబకాయానికి దోహదం చేస్తుంది.మీరు మీ బరువును నియంత్రించా లనుకుంటే, బంగాళాదుంప తీసుకోకపోవడమే మంచిది.
అదనంగా బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునేవారు దీనిని తినకపోవడం మేలు. బంగాళాదుంపలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.
బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చిన, లేదా ఉడకబెట్టిన బంగాళాదుంపలు వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు.
బంగాళాదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుందట. అంతేకాకుండా ఈ దుంపలు తింటే ఉబ్బరం, అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్ లో తేలింది. మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. కళ్ల సంరక్షణకు ఎలాంటి చిట్కాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
