మిమ్మల్ని రోజంతా ఎనర్జీతో ఉంచే అల్పాహారం.. 

షేర్ చేయండి:
మిమ్మల్ని రోజంతా ఎనర్జీతో ఉంచే అల్పాహారం.. 

సాక్షి లైఫ్ : రోజును ప్రారంభించడానికి ఫైబర్-రిచ్ అల్పాహారం చాలా ముఖ్యం. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీకు ఏమాత్రం అలసట అనిపించదు. ఒకవేళ మీరు తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు శక్తివంతంగా ఉండటానికి ఈ ఆరోగ్యకరమైన అల్పాహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు.. 

ఆరోగ్యకరమైన అల్పాహారం చాలా ముఖ్యం. ఉదయం అల్పాహారం రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉండటానికి మంచి, ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం మానేయకూడదని, ఒకవేళ మానేస్తే అది మన ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రత్యేక శ్రద్ధ అవసరం.. 

అటువంటి పరిస్థితిలో అల్పాహారం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక ఫైబర్ అల్పాహారం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.  అధిక ఫైబర్-తో కూడిన కొన్ని రుచికరమైన,ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెసర దోశ..  

పెసరపప్పు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. శెనగపిండి, పెసరపప్పుతో చేసిన ప్రోటీన్-రిచ్ దోశ ఆరోగ్యకరమైన, పోషకమైన అల్పాహారం కోసం ఖచ్చితంగా సరిపోతుంది.

మొలకలు.. 

పోషకాలు అధికంగా ఉండే మొలకలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కూరగాయలు, నిమ్మరసంతో పాటు మొలకెత్తిన పప్పులు, పచ్చిమిర్చి, కాయధాన్యాలు వంటి తాజా ఫైబర్‌తో కూడిన రుచికరమైన అల్పాహారం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 

గోధుమ పిండి దోశ.. 

గోధుమ పిండి రోటీని తినవచ్చు, కానీ మీరు ఫైబర్ అధికంగా ఉండే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే, గోధుమ పిండితో చేసిన దోస మీకు ఖచ్చితంగా సరిపోతుంది. పిండితో చేసిన సన్నని , క్రిస్పీ దోసెలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  

పోహా..  

పోహా చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. అటుకులు, ఉల్లిపాయలు, బఠానీలు ,వేరుశెనగలతో వండిన పోహా ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. ఇందులో ఫైబర్ తోపాటు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.