సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
సాక్షి లైఫ్ : మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే, దంతాలను సరిగ్గా శుభ్రపరచడం చాలా ముఖ్యం. దైనందిన జీవితంలో మనం పలురకాల ఆహారపదార్థాలను తింటాము. అవి కొన్నిసార్లు మన చిగుళ్ళలో లేదా దంతాలలో ఏదో ఒక మూలలో చిక్కుకుపోతాయి. కాబట్టి టూత్ బ్రష్ను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళ కోసం ఏమి చేయాలంటే..?
ఇది కూడా చదవండి.. మంచినీళ్లు తాగడానికి ఏ బాటిల్ మంచిది..?
- దంతాలు బాగా శుభ్రం కావాలంటే కనీసం రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి. మీ దంతాలను పూర్తిగా బ్రష్ చేయడానికి రెండు నుంచి మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయించండి.
-మృదువుగా ఉండే బ్రష్ ను మాత్రమే ఎంచుకోండి. తద్వారా మీ చిగుళ్లపై ఎలాంటి ప్రభావం పడదు.
- సరైన దంత ఆరోగ్యం కోసం, మీ బ్రష్ పరిమాణం కూడా సరిగ్గా ఉండాలి. చాలా పెద్దది లేదా చిన్నది అయిన బ్రష్‌ను ఉపయోగించడం వల్ల మీ దంతాల శుభ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి సరైనటూత్ బ్రష్ ను వాడండి.
ఒకవేళ ఎలక్ట్రిక్ బ్రష్‌ని ఉపయోగిస్తుంటే, మీకు అనుగుణంగా సరైన పవర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. లేదా మీరు దీన్ని మీడియంలో కూడా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మృదువైన లేదా ఎక్కువ ప్రెజర్ దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
బ్రష్‌ను సరిగ్గా ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కొనుగోలు సమయంలో అది మీ చేతికి సరిగ్గా సరిపోతుందో లేదో తనిఖీ చేయడం ముఖ్యం.
సున్నితమైన చిగుళ్ల కోసం తయారు చేసిన మంచి నాణ్యమైన బ్రష్‌ను మాత్రమే వాడాలి. దృఢంగా ఉన్న బ్రష్ వాడితే దంతాలకు హాని కలిగే అవకాశం ఉంది..
టూత్ బ్రష్ ఎన్నాళ్లకు ఓసారి మార్చాలి..?
కనీసం మూడు నెలలకు ఓసారి టూత్ బ్రష్ మార్చాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతకంటే ఎక్కువ కాలం వాడితే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
