Fatty Liver : చిన్నారులనూ చుట్టుముడుతున్న ఫ్యాటీ లివర్.. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాలేయ వ్యాధులు అనగానే సాధారణంగా మద్యపానం లేదా పెద్దవారి అలవాట్లే గుర్తుకొస్తాయి. కానీ ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోయినా, సైలెంట్‌‌గా శరీరంలోకి చేరే 'ఫ్యాటీ లివర్' సమస్య ఇప్పుడు చిన్నారులనూ తీవ్రంగా వేధిస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సు  వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో వెల్లడైన తాజా వివరాలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి 100 మంది పెద్దవారిలో దాదాపు 39 మంది ఈ సమస్యతో బాధపడుతుండగా, చిన్నారుల్లోనూ ఈ ముప్పు ఏకంగా 35.4 శాతం మేర ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

లక్షణాలు లేకపోవడమే అసలైన ముప్పు..

కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ప్రాథమిక దశలో ఈ సమస్య ఎలాంటి స్పష్టమైన లక్షణాలనూ చూపించదు. లోపల సమస్య తీవ్రరూపం దాల్చేవరకు చాలామందికి కాలేయం దెబ్బతింటోందనే విషయమే తెలియదు. చిన్నారుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతూ, యుక్తవయస్సు వచ్చేసరికి కాలేయ వాపు (hepatitis), సిర్రోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల్లో ఈ సమస్య ఎందుకు వస్తోంది..?
 
అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు, పంచదార అధికంగా ఉండే బేకరీ ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి. టీవీలు, మొబైల్ స్క్రీన్లకే అతుక్కుపోవడం, మైదానాల్లో ఆటలు కనుమరుగవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. చిన్నతనంలోనే వచ్చే స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్-2 డయాబెటిస్ ప్రారంభ దశ కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆహారపు అలవాట్లను మార్చండి: ప్యాక్డ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ పూర్తిగా తగ్గించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని ఇంట్లోనే అలవాటు చేయాలి. పిల్లలు రోజుకు కనీసం ఒక గంట పాటు చెమట పట్టేలా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి.

 పిల్లలు లావుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నారనుకోవడం పొరపాటు. అధిక బరువు ఉన్నట్లయితే సాధారణ శారీరక తనిఖీల్లో భాగంగా వైద్యుల సలహాతో కాలేయ పనితీరు (liver function tests), అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించడం ఉత్తమం. జీవనశైలి మార్పులు, సమతుల్య ఆహారంతో ప్రాథమిక దశలోనే ఫ్యాటీ లివర్‌ను తిప్పికొట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.